అదరహో అనిపించిన కొదమసింహం

Update: 2016-12-08 23:24 GMT

ఎప్పుడెప్పుడు చిరంజీవి 'ఖైదీ నెంబర్ 150 ' చిత్ర టీజర్ ని విడుదల చేస్తారా.. ఎప్పుడెప్పుడు తమ అభిమాన నటుడుని చూద్దామా అని వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్న మెగా ఫ్యాన్స్ పండగ చేసేసుకుంటున్నారు. ఈ రోజు ఉదయం నుండి తమ అభిమాన నటుడు 'ఖైదీ.... 'చిత్రం లో ఎలాంటి నటనను ప్రదర్శించబోతున్నాడో అని తెగ ఆత్రంగా ఎదురు చూస్తున్నారు మెగా అభిమానులు. అందులోను గత తొమ్మిదేళ్లుగా నటనకు దూరంగా ఉంటున్న చిరు చాలా ఏళ్ళ తర్వాత నటిస్తున్న సినిమా కావడం కూడా ఈ సినిమాపై ఆసక్తి పెరగడానికి ఒక కారణం.

ఇక ఈ చిత్ర టీజర్ ని కొద్ది నిమిషాల ముందే యూట్యూబ్ లో విడుదల చేసింది 'ఖైదీ... 'చిత్ర యూనిట్. ఈ టీజర్ లో చిరంజీవి మాస్ లుక్ తో ఫైటింగ్ సీన్ తో బోణి చేసాడు. క్లాస్ లుక్ తో మాస్ డైలాగ్తో 'ఏదైనా నాకు నచ్చితేనే చేస్తా... నాకు నచ్చితేనే చూస్తా.... కాదని బలవంతం చేస్తే కోస్తా అంటూ.... ఫైట్ సీన్ తో ఇరగదీసిన చిరు చివరిలో స్వీట్ వార్నింగ్' అంటూ నవ్వుతూ భయపెట్టాడు. అలా డైలాగ్ చెప్పిన చిరు ఒక విలన్ ని చేత్తో లాగుతూ నడిచే లుక్ అదిరిపోయిందనే చెప్పాలి. ఇక టీజర్ చివర్లో చెమటలు తుడుచుకుంటూ చిరు సూపర్ అనిపించాడు.

ఈ టీజర్ తో సినిమా పై వున్న అంచనాలను అమాంతం గా 1000 రెట్లు పెంచేశారనే చెప్పాలి. చిరంజీవి ఖైదీ నెంబర్ 150 లో ఎలా ఉంటాడో అని మెగా ఫ్యాన్స్ తో పాటు సాధారణ ప్రేక్షకుడు సైతం అత్యంత ఆరాటంతో వున్నారు. ఇక ఈ టీజర్ చూసాక చిరు మళ్ళీ పాత చిరుని గుర్తు చేసేలా వున్నాడు. అప్పట్లో వున్న ఎనర్జీ లెవెల్స్ ఏ మాత్రం తగ్గకుండా చిరు కనిపిస్తున్నాడు. ఫైటింగ్ లో దూకుడు, డైలాగ్లో భారీ తనాన్ని వదలకుండా అదే దూకుడు ప్రదర్శించాడు చిరు. ఇక ఈ చిత్రంలో చిరంజీవికి జోడిగా కాజల్ నటిస్తుంది. ఈ చిత్రాన్ని సురేఖ నిర్మాణ సారధ్యంలో వి.వి వినాయక్ డైరెక్ట్ చేస్తున్నాడు. రామ్ చరణ్ లైన్ ప్రొడ్యూసర్ గా వ్యవహరించనున్న ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని సమకూర్చాడు. ఇక ఈ 'ఖైదీ... 'పాటలను ఈనెల 25 న విడుదల చేసి... వచ్చే సంక్రాంతి కి సినిమా విడుదలకు సిద్ధం చేస్తున్నారు.

Similar News