Breaking : జూనియర్ ఎన్టీఆర్ కు షూటింగ్ లో గాయాలు

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కు షూటింగ్ లో గాయాలయ్యాయి. ఒక యాడ్ షూటింగ్ లో గాయపడిన ఎన్టీఆర్ కు స్వల్ప గాయాలయ్యాయి

Update: 2025-09-19 11:38 GMT

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కు షూటింగ్ లో గాయాలయ్యాయి. ఒక యాడ్ షూటింగ్ లో గాయపడిన ఎన్టీఆర్ కు స్వల్ప గాయాలయ్యాయి. స్వల్పగాయాలేనని, అభిమానులు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని జూనియర్ ఎన్టీఆర్ టీం తెలిపింది. ఒక యాడ్ షూటింగ్ చేస్తుండగా జూనియర్ ఎన్టీఆర్ కాలికి స్వల్ప గాయమయిందని ఆయన టీం ఒక ప్రకటనలో తెలిపింది. అన్నపూర్ణ షూటింగ్ లో షూటింగ్ జరుగుతుండగా ఈ ప్రమాదం జరిగింది.

స్వల్పగాయాలే...
ఇటీవల జూనియర్ ఎన్టీఆర్ ఒక యాడ్ షూటింగ్ లో పాల్గొంటున్నారు. హైదరాబాద్ లో ఈషూటింగ్ జరుగుతుంది. దీనికి సంబంధించి మరికాసేపట్లో పూర్తి వివరాలు అందే అవకాశముంది. ఇప్పటి వరకూ అందుతున్న సమాచారం మేరకు పెద్ద గాయాలు కాలేదని, స్వల్ప గాయాలు కావడంతో ఆసుపత్రిలో చికిత్స చేయించుకున్న అనంతరం ఇంట్లో విశ్రాంతి తీసుకునేందుకు వెళ్లారని చెబుతున్నారు.


Tags:    

Similar News