తిరుమలలో ప్రభాస్

ప్రభాత సేవలో పాల్గొని వేంకటేశ్వర స్వామి వారి ఆశీస్సులు తీసుకున్నారు ప్రభాస్. దర్శనంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వాదం

Update: 2023-06-06 03:06 GMT

తిరుమల శ్రీవారిని ప్రముఖ సినీ నటుడు ప్రభాస్ దర్శించుకున్నారు.. బుధవారం వేకువ జామున సాంప్రదాయ దుస్తులు ధరించిన ప్రభాస్ వైకుంఠం మొదటి ద్వారం ద్వారా ఆలయ ప్రవేశం చేశారు. ఆలయ అధికారులు ప్రభాస్ కు స్వాగతం‌ పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. ప్రభాత సేవలో పాల్గొని వేంకటేశ్వర స్వామి వారి ఆశీస్సులు తీసుకున్నారు ప్రభాస్. దర్శనంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వాదం అందించారు. ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి స్వామి వారి తీర్ధ ప్రసాదాలు అందజేశారు. మంగళవారం మధ్యాహ్నం మూడు గంటల వరకు ప్రభాస్ తిరుమలలోనే బస చేస్తారు. ఆ తర్వాత తిరుపతిలోని తారకరామ స్టేడియంలో జరిగే ఆదిపురుష్ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కు హాజరు కానున్నారు. ప్రభాస్‌ను చూసేందుకు భక్తులు ఒక్కసారిగా ఎగబడ్డారు. వైకుంఠం-1 క్యూ కాంప్లెక్స్ వద్ద, మహా ద్వారం నుంచి బయటకు వచ్చే సమయంలో భక్తులను పోలీసులు విజిలెన్స్‌ అదుపు చేయలేకపోయింది. దీంతో అతి కష్టం మీద ప్రభాస్ ను ఆలయం ముందు నుంచి రాంభాఘీచ గేట్ వరకు తీసుకొచ్చి పోలీసులు కారులో పంపించారు.

ఆదిపురుష్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను ఘ‌నంగా నిర్వ‌హించటానికి ఏర్పాటు పూర్తి చేస్తున్నారు. ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ వ‌ర్మ ఆధ్వ‌ర్యంలోనే ఈ ఈవెంట్ జరగనుంది. ల‌క్ష మందికి పైగానే ప్రీరిలీజ్ ఈవెంట్ కు వ‌స్తార‌ని భావిస్తున్నారు. ప్రీరిలీజ్ ఈవెంట్‌కి చిన జీయ‌ర్ స్వామి ముఖ్య అతిథిగా వ‌స్తున్నారు. భారీ అయోధ్య సెట్‌ను నిర్మించి అందులో ఈవెంట్‌ను నిర్వ‌హిస్తుండ‌టం విశేషం. అలాగే 200 మంది డాన్స‌ర్స్‌, సింగ‌ర్స్ ఈ సినిమాలో జై శ్రీరాం పాట‌ను పెర్ఫామ్ చేయ‌బోతున్నారు. ఈ ఈవెంట్‌లో అజయ్ - అతుల్ జై శ్రీరామ్ పాటకు లైవ్ పార్ఫామెన్స్ ఇవ్వబోతున్నారు. 200 మంది సింగర్స్, 200 మంది డ్యాన్సర్లు ముంబై నుంచి ఈ వేడుకకు రానున్నారు. జూన్ 16వ తేదీన ప్రపంచవ్యాప్తంగా ఆదిపురుష్ విడుదలకానుంది. తెలుగు, తమిళం, మలయాళం, హిందీ, కన్నడ భాషల్లో ఒకేసారి విడుదల కానుంది. హై బడ్జెట్ మూవీ కావడం వల్ల దేశవ్యాప్తంగా ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అంటూ ఎదురు చూస్తోన్నారు.


Tags:    

Similar News