Unstoppable : అన్‌స్టాపబుల్ షోలో రష్మికకి కాల్ చేసిన విజయ్ దేవరకొండ..

బాలయ్య అన్‌స్టాపబుల్ షోలో రష్మికకి కాల్ చేసిన విజయ్ దేవరకొండ. వైరల్ అవుతున్న ప్రోమో.

Update: 2023-11-18 07:15 GMT

Unstoppable with NBK : బాలయ్య అన్‌స్టాపబుల్ షో మళ్ళీ తిరిగి వచ్చేసింది. ఆహాలో ప్రసారమవుతున్న ఈ షో.. ఇప్పటికే రెండు సీజన్స్ ని సక్సెస్ ఫుల్ గా పూర్తి చేసుకుంది. ఇప్పుడు మూడో సీజన్ తో ప్రేక్షకులను పలకరించబోతుంది. ఈ సీజన్ ని ఒక స్పెషల్ ఎపిసోడ్ తో మొదలు పెట్టారు. ఆ ఎపిసోడ్ లో 'భగవంత్ కేసరి' మూవీ టీం సందడి చేసింది. ఇక తరువాత ఎపిసోడ్ లో బాలీవుడ్ స్టార్ ని బాలయ్య తీసుకు వస్తున్నారు.

టాలీవుడ్ డైరెక్టర్ సందీప్ వంగా దర్శకత్వంలో బాలీవుడ్ స్టార్ రణబీర్ కపూర్, రష్మిక మందన్న కలిసి నటిస్తున్న చిత్రం 'యానిమల్'. డిసెంబర్ 1న రిలీజ్ కి సిద్దమవుతున్న ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఈ మూవీ టీం బాలయ్య అన్‌స్టాపబుల్ షోకి అతిథులుగా వచ్చారు. రీసెంట్ గా ఈ ఎపిసోడ్ ప్రోమోని ఆహా టీం రిలీజ్ చేసింది. ఈ ప్రోమోలో బాలయ్య, రణబీర్, రష్మిక, సందీప్ కలిసి సందడి చేశారు. అయితే ఎపిసోడ్ లో మరో స్టార్ కూడా పాల్గొన్నారు.
రష్మిక రూమర్ బాయ్ ఫ్రెండ్ విజయ్ దేవరకొండ ఈ ఎపిసోడ్ లో ఫోన్ కాల్ ద్వారా పాల్గొన్నారు. బాలయ్య రష్మికని విజయ్ తో మాట్లాడించారు. ప్రోమోలో ఈ విషయం అందర్నీ ఆకట్టుకుంటుంది. ఈ ఎపిసోడ్ లో బాలకృష్ణ.. విజయ్-రష్మికల ప్రేమ విషయాన్ని బయట పెట్టబోస్తున్నారా..? అని అందరిలో క్యూరియాసిటీ క్రియేట్ అయ్యింది. ఎందుకంటే.. గతంలో ప్రభాస్ ప్రేమ విషయాలు గురించి కూడా బాలయ్య అడిగి ఒక క్లారిటీ తీసుకు వచ్చారు.
దీంతో ఈ ఎపిసోడ్ కోసం విజయ్-రష్మిక అభిమానులు ఆసక్తితో ఎదురు చూస్తున్నారు. ఇక ఈ ప్రోమోలో రణబీర్ కపూర్ బాలయ్య డైలాగ్స్ చెప్పడం, బాలయ్య సాంగ్స్ కి డాన్స్ వేయడం.. టాలీవుడ్ ఆడియన్స్ ని బాగా ఆకట్టుకుంటున్నాయి. అలాగే దర్శకుడు సందీప్ వంగాని టాలీవుడ్ లోని ఇతర దర్శకులు గురించి ప్రశ్నించగా.. వాటికీ సందీప్ ఇచ్చిన ఆన్సర్స్ కూడా ఆసక్తి రేపుతున్నాయి. ఈ ఫుల్ ఎపిసోడ్ నవంబర్ 24 నుంచి స్ట్రీమ్ కానుంది.

Full View

Tags:    

Similar News