రెహమాన్ కాన్సర్ట్ వివాదం.. విజయ్ ఆంటోనీ పరువునష్టం దావా కేసు..

ఏ ఆర్ రెహమాన్ మ్యూజికల్ కాన్సర్ట్ వివాదంలోకి మరో మ్యూజిక్ డైరెక్టర్ విజయ్ ఆంటోనీ ఎంట్రీ. పరువునష్టం దావా కేసు వేస్తాను అంటూ..

Update: 2023-09-17 05:26 GMT

ఇటీవల చెన్నైలో ఏ ఆర్ రెహమాన్ (A. R. Rahman) నిర్వహించిన మ్యూజికల్ కాన్సర్ట్ పెద్ద వివాదంగా మారిన సంగతి తెలిసిందే. రెండు ప్రైవేట్ సంస్థలు కలిసి ఏర్పాటు చేసిన ఈ ప్రోగ్రామ్ టికెట్స్ ని 5000 నుంచి 20 వేల వరకు అమ్మారు. కానీ ఈవెంట్ నిర్వహించడంలో మాత్రం భారీగా విఫలమయ్యారు. ఈవెంట్ కి మించిన జనాలకు టికెట్స్ అమ్మడం, దీంతో టికెట్స్ కొన్నా కాన్సర్ట్ కి వెళ్లలేని పరిస్థితి రావడం, పార్కింగ్ ఏరియాని 2 కిలోమీటర్ల దూరంలో ఇవ్వడం.. ఇలా అనేక కారణాలతో ఆడియన్స్ తీవ్ర ఇబ్బందులు పడ్డారు.

దీంతో ఆడియన్స్ ఈవెంట్ కండక్ట్ చేసిన మేనేజ్మెంట్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొంతమంది రెహమాన్ పై కూడా అసహనం తెల్పుతున్నారు. ఇక ఈ విషయం తమిళనాట పెద్ద వివాదంగా మారి పాలిటిక్స్ వరకు చేరుకుంది. దీని పై ఉదయనిధి స్టాలిన్ ఒక ప్రత్యేక ప్రెస్ మీట్ పెట్టి.. ఈవెంట్ ని అలా కండక్ట్ చేసిన వారిపై చర్యలు తీసుకుంటామని తెలియజేశాడు. ఇక ఇది ఇలా ఉంటే, ఈ వివాదంలోకి ఇప్పుడు మరో మ్యూజిక్ డైరెక్టర్ ఎంట్రీ ఇచ్చాడు. బిచ్చగాడు సినిమాలతో తెలుగువారికి దగ్గరైన విజయ్ ఆంటోనీ (Vijay Antony) ఈ వివాదం గురించి ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేశాడు.
రెహమాన్ ఈవెంట్ అలా ఫెయిల్ అవ్వడానికి విజయ్ ఆంటోనీనే కారణం అంటూ కొన్ని తమిళ్ యూట్యూబ్ ఛానల్స్ వీడియో చేస్తూ వస్తున్నాయి. ఇక ఈ వీడియోలు విజయ్ ఆంటోనీ వరకు చేరడంతో స్పందిస్తూ ఒక లెటర్ రిలీజ్ చేశాడు. ఆ లెటర్ లో ఏం రాసుకొచ్చాడు అంటే.. "రెహమాన్ కాన్సర్ట్ వివాదాన్ని నేనే కావాలని సృష్టించినట్లు కొన్ని యూట్యూబ్ ఛానల్స్ వీడియోలు పోస్ట్ చేస్తున్నారు. అలాంటి యూట్యూబ్ ఛానల్స్ పై నేను పరువునష్టం దావా కేసు వేస్తాను. ఆ కేసు ద్వారా వచ్చిన డబ్బుని పేద మ్యూజిక్ కుటుంబాలకు అందజేసి సహాయం చేస్తాను" అంటూ పేర్కొన్నాడు. ప్రస్తుతం ఈ లెటర్ నెట్టింట వైరల్ గా మారింది.


Tags:    

Similar News