Venky - Mahesh : పేకాట ఆడుతున్న వెంకటేష్, మహేష్ బాబు..

ఒక ప్రైవేట్ ఈవెంట్ లో పేకాట ఆడుతూ చిల్ అవుతూ కనిపించిన వెంకటేష్, మహేష్ బాబు.

Update: 2023-11-05 05:50 GMT

Venkatesh - Mahesh Babu : విక్టరీ వెంకటేష్, సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాలోనే కాదు బయట కూడా పెద్దోడు, చిన్నోడు లాగానే ప్రవర్తిస్తుంటారు. ఇద్దరు అన్నదమ్ములలా చాలా సరదాగా కలిసి మెలిసి ఉంటారు. ఇటీవల వెంకటేష్ కూతురి ఎంగేజ్మెంట్ జరగగా.. ఇండస్ట్రీ నుంచి చిరంజీవి, మహేష్ బాబు మాత్రమే హాజరయ్యారు. ఆ నిశ్చితార్థం వేడుకలోని పెద్దోడు, చిన్నోడు ఫోటోలు చూసి అభిమానులు ఫుల్ ఖుషి అయ్యారు.

అయితే తాజాగా వీరిద్దరూ కలిసి పేకాటాడుతూ కనిపించారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారాయి. ఒక బడా కంపెనీ ఏర్పాటు చేసిన ప్రైవేట్ ఈవెంట్ కి వీరిద్దరూ హాజరయ్యినట్లు సమాచారం. అక్కడే చిల్ అవుతూ పెద్దోడు, చిన్నోడు పేకాడుతూ కనిపించారు. వారిద్దరి చేతిలో కార్డ్స్ ఉంటే, వారి ముందు టేబుల్ పైన రూ.500 నోట్లు గుంపుగా పడేసి కనిపించాయి. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.







ఇక మహేష్ బాబు గుంటూరు కారం విషయానికి వస్తే.. మూవీ నుంచి ఫస్ట్ సింగల్ ప్రోమో వచ్చేసింది. 'దమ్ మసాలా' అని సాగే ఈ పాట ఫుల్ లిరికల్ సాంగ్ ని నవంబర్ 7న రిలీజ్ చేస్తామంటూ ప్రకటించారు. త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్స్ గా నటిస్తున్నారు. సంక్రాంతి కానుకగా ఈ మూవీ రిలీజ్ కాబోతుంది. రిలీజ్ అయిన ఆ 'దమ్ మసాలా' ప్రోమో మీరుకూడా చూసేయండి.

Full View

 


 


 


Tags:    

Similar News