Venkatesh : చిరంజీవి లేకుంటే హిమాలయాలకు వెళ్లిపోయేవాడిని..

చిరంజీవి లేకుంటే నేనెప్పుడో హిమాలయాలకు వెళ్లిపోయేవాడిని అంటూ వెంకటేష్ చెప్పుకొచ్చారు.

Update: 2023-12-28 04:56 GMT

Chiranjeevi, Venkatesh

Venkatesh : టాలీవుడ్ హీరో విక్టరీ వెంకటేష్ తన సినీ కెరీర్ లో 75వ సినిమా మైలు రాయిని చేరుకున్నారు. ‘సైంధవ్‌’ చిత్రాన్ని తన ల్యాండ్ మార్క్ మూవీగా వెంకటేష్ ఆడియన్స్ ముందుకు తీసుకు వస్తున్నారు. ఇక 75 చిత్రాలు పూర్తి చేసుకున్న వెంకటేష్‌కి శుభాకాంక్షలు తెలియజేసేలా సైంధవ్‌ నిర్మాతలు ఓ గ్రాండ్ ఈవెంట్ ని నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి చిరంజీవి, రాఘవేంద్రరావు, బ్రహ్మానందం, నాని, అడివిశేష్, శ్రీవిష్ణు, అలీ.. ఇలా పలువురు స్టార్స్ హాజరయ్యారు. ఈ ఈవెంట్ లో వెంకీ మామ తన మూవీ జర్నీ గుర్తు చేసుకొని ఎమోషనల్ అయ్యారు. ఇక ఆధ్యాత్మిక భావాలు కలిగిన వెంకటేష్.. చిరంజీవి లేకుంటే హిమాలయాలకు వెళ్లిపోయేవాడిని అంటూ చెప్పుకొచ్చారు.
వెంకటేష్ ఏమన్నారంటే..
"మా గురువు గారు రాఘవేంద్రరావు డైరెక్షన్ లో 'కలియుగ పాండవులు' సినిమా చేసి నా సినీ కెరీర్ మొదలు పెట్టాను. ఈ ప్రయాణంలో దాసరి నారాయణ, కె విశ్వనాథ్ వంటి అగ్ర దర్శకులతో వర్క్ చేసే అదృష్టం నాకు లభించింది. ఇక నటుడిగా విజయాలు, అపజయాలతో పాటు అంతకుమించిన అభిమానుల ప్రేమని చూశాను.
ఇన్నాళ్ల కెరీర్ లో వాళ్ళు నన్ను విక్టరీ, రాజా, పెళ్లి కానీ ప్రసాద్, పెద్దోడు, వెంకీమామ అంటూ చాలా పేర్లతో పిలిచారు. అయితే వాళ్ళు పిలిచే పేర్లు మారుతున్నాయి గాని ప్రేమ మాత్రం మారలేదు. అయితే ఇంతటి ప్రేమని వదిలేసుకొని చాలా సార్లు హిమాలయాలకు వెళ్లిపోదామనుకున్నాను. కానీ చిరంజీవి గారి వల్లే ఇంకా నటిస్తూ వస్తున్నాను.
ఒకసారి ఇలాగే హిమాలయాలకు వెళ్ళిపోదాం అని అనుకున్నప్పుడు.. చిరంజీవి గారు తొమ్మిదేళ్ల విరామం తరువాత ఖైదీ నంబర్ 150 మూవీతో వచ్చి బ్లాక్ బస్టర్ అందుకున్నారు. అది చూసిన నేను.. ఈ నటన కొనసాగించాలని తెలుసుకున్నాను. చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున గారు నాకు ప్రతిసారి పాజిటివ్ ఎనర్జీ ఇస్తూ వచ్చారు. అందుకే ఇంకా సినిమాల్లో కొనసాగుతూ వస్తున్నాను" అంటూ చెప్పుకొచ్చారు.
ఇక సైంధవ్‌ విషయానికి వస్తే.. సంక్రాంతి కానుకగా జనవరి 13న రిలీజ్ కాబోతుంది. శైలేష్ కొలను ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేశారు. ఫాదర్ డాటర్ సెంటిమెంట్ తో యాక్షన్ థ్రిల్లర్ గా ఆడియన్స్ ముందుకు వస్తుంది. ఈ చిత్రంలో తమిళ హీరో ఆర్య ఓ ముఖ్య పాత్ర చేస్తున్నారు.
Tags:    

Similar News