SSMB 29 : అప్ డేట్ అదేనా? మోసగాళ్లకు మోసగాడు సినిమా రేంజ్ కు మించి ఉంటుందా?

SSMB 29 పై వస్తున్న అప్ డేట్స్ అభిమానులను ఊరిస్తూనే ఉంటాయి.

Update: 2025-07-17 06:23 GMT

SSMB 29 పై వస్తున్న అప్ డేట్స్ అభిమానులను ఊరిస్తూనే ఉంటాయి. ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న SSMB 29 పై భారీ అంచనాలు మూవీ అనౌన్స్ చేసినప్పటి నుంచే ఉన్నాయి. రాజమౌళి ఈ చిత్రానికి సంబంధించి ఎప్పటికప్పుడు తక్కువగా అప్ డేట్స్ ఇస్తుంటూ.. ఫ్యాన్స్ తో పాటు ప్రేక్షకులను ఒకరకమైన ట్రాన్స్ లో ఉంచేందుకు ఎక్కువ ఇష్టపడతారు. అప్పుడప్పుడు మాత్రం అప్ డేట్ వదిలి అలరిస్తుంటాడు. అందుకే రాజమౌళి మూవీపై ఏ రకమైన అప్ డేట్ వచ్చినా అది మహేష్ బాబు ఫ్యాన్స్ కు మాత్రమే కాకుండా యావత్ సినీ ప్రేక్షకులకు కూడా అక్కడ కట్టిపడేస్తుంది. ఎప్పుడు అప్ డేట్ వస్తుందా? అని ఎదురు చూస్తుంటారు.

లీకులే ఎక్కువగా...
అయితే రాజమౌళి సినిమాకు సంబంధించి అప్ డేట్స్ కంటే లీకులే ఎక్కువగా వస్తాయి. లీకులతోనూ, రూమర్స్ తోనూ అభిమానులు ఎవరికి తోచినట్లు వారు ఊహించుకుంటారు. అదే నిజమవ్వాలని కోరుకుంటారు. హీరోయిన్, విలన్ విషయంలోనూ ఊరించి రాజమౌళి చాలా రోజుల పాటు నాన్చి లీకులు వదిలి చివరకు నిజం చేశాడు. ప్రియాంకచోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ ల విషయం కూడా ముందుగానే లీకులు రావడం, తర్వాత అవి నిజం కావడం జరిగిపోవడంతో లీకులను కూడా అప్ డేట్స్ కింద ఫ్యాన్స్ పరిగణిస్తారు. దీనికి సంబంధించిన షూటింగ్ శరవేగంతో పూర్తవుతుందని చెబుతున్నారు. మహేష్ బాబు తో ఫైటింగ్ సీన్లు కూడా ఇటీవల పూర్తి చేశారని తెలిసింది.
డ్యాన్స్ హైలెట్ గా...
దీంతో పాటు మరో కీలక సన్నివేశాలను చిత్రీకరించేందుకు దర్శకధీరుడు రాజమౌళి ప్లాన్ చేసినట్లు సమాచారం. ఇక RRR మూవీ తరహాలో ఒక పాటను డ్యాన్స్ తో అలరించేలా రాజమౌళి ప్లాన్ చేసినట్లు చెబుతున్నారు. మహేష్ బాబు ప్రస్తుతం ఆ డ్యాన్స్ ప్రాక్టీస్ చేసే పనిలో ఉన్నారని కూడా నెట్టింట వైరల్ అవుతుంది. కొత్త తరహాలో డ్యాన్స్ మూవ్ మెంట్స్ ను ప్రేక్షకుల ముందుంచడానికి రాజమౌళి ప్రయత్నిస్తున్నారు. డ్యాన్స్ మాస్టర్ కు అనేక సూచనలు ఇచ్చి మరీ కొత్త స్టెప్పులతో అలరించాలని సిద్ధమయ్యారన్నది టాక్. ఈ మూవీలో ఇది హైలెట్ గా నిలుస్తుందని అంటున్నారు. అడ్వంచెర్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ మూవీ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అడవుల్లోనే షూటింగ్ చేస్తుండటంతో మరోసారి మహేష్ బాబు తండ్రి సూపర్ స్టార్ కృష్ట నటించిన మోసగాళ్లకు మోసగాడు సినిమా రేంజ్ లో తీయాలన్న ఉన్నాడట రాజమౌళి. అందులో కౌబాయ్ గా కృష్ణ అలరించాడు. అంతకు మించి ఈ మూవీ అదరగొడతారట. అదే లుక్ లో మహేష్ బాబు కనిపిస్తుండటంతో ఆ సినిమా తరహాలోనే ఉండొచ్చన్న టాక్ ఉంది. అదండీ అసలు విషయం.


Tags:    

Similar News