అన్ స్టాపబుల్ 2 ట్రైలర్.. శుక్రవారం నుంచి స్ట్రీమింగ్

అక్టోబర్ 14 నుంచి అన్ స్టాపబుల్ 2 స్ట్రీమింగ్ కు రెడీ అవుతోంది. ప్రతి శుక్రవారం అక్టోబర్ 14 నుంచి ఎపిసోడ్ స్ట్రీమింగ్ కానుంది.

Update: 2022-10-09 07:28 GMT

unstoppable 2 trailer

హీరోగా అయినా.. హోస్ట్ గా అయినా ప్రేక్షకులను అలరించడంలో నందమూరి బాలకృష్ణకు సాటిలేరెవ్వరు. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫాం ఆహా లో స్ట్రీమ్ అయిన అన్ స్టాపబుల్ విత్ ఎన్బీకే సీజన్ 1 కు ఊహించని రీతిలో రెస్పాన్స్ వచ్చింది. అన్ స్టాపబుల్ సీజన్ 2 స్ట్రీమింగ్ కు ఆహా రెడీ అయింది. ఇటీవలే విజయవాడలో అన్ స్టాపబుల్ 2 టీజర్ ను లాంచ్ చేశారు. తాజాగా అన్ స్టాపబుల్ 2 ట్రైలర్ ను విడుదల చేసింది ఆహా.

అక్టోబర్ 14 నుంచి అన్ స్టాపబుల్ 2 స్ట్రీమింగ్ కు రెడీ అవుతోంది. ప్రతి శుక్రవారం అక్టోబర్ 14 నుంచి ఎపిసోడ్ స్ట్రీమింగ్ కానుంది. ఇక ట్రైలర్‏లో నిధిని అన్వేషిస్తూ గుహలోకి వెళ్తారు బాలయ్య. అక్కడ ఎన్నో సవాల్లు.. అడ్డంకులు ఎదుర్కొని.. చివరకు నిధిని చేరుకుంటారు. అక్కడ ఉన్న ఓ బాక్స్ ఓపెన్ చేయగానే.. అందులో ఓ ఖడ్గం లభిస్తుంది. అది చేతపట్టుకుని "గెలుపే ఊపిరిగా.. పట్టుదలే ప్రాణంగా.. ఆశయమే గమ్యంగా పోరాడే యోధుడికి విజయం అన్‌స్టాపబుల్‌" ప్రశ్నల్లో మరింత ఫైర్, ఆటల్లో మరింత డేర్, సరదాల్లో మరింత సెటైర్, మీకోసం.. మరింత రంజుగా.. ఈ ట్రైలర్ తో షో పై అంచనాలు పెరిగిపోయాయి.
Full View


Tags:    

Similar News