సూపర్ కాంబో మూవీకి సర్వం సిద్ధం.. క్లాప్ కొట్టడమే తరువాయి
త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకుడిగా మ్యాజిక్ రిపీట్ చేయడానికి సిద్ధమయ్యాడు.
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకుడిగా మ్యాజిక్ రిపీట్ చేయడానికి సిద్ధమయ్యాడు. త్రివిక్రమ్ మూవీలో విక్టరీ వెంకటేశ్ హీరోగా నటిస్తుండటంతో మరింత ఆసక్తి పెరిగింది. ఇప్పటికే సంక్రాంతికి వస్తున్నాం తో సూపర్ హిట్ కొట్టేసిన హీరో వెంకటేశ్ కు మరో మంచి మూవీ ఆయన కెరీర్ లో చేరబోతుందన్న టాక్ టాలీవుడ్ లో వినపడుతుంది. ఇప్పటికే త్రివిక్రమ శ్రీనివాస్, విక్టరీ వెంకటేశ్ కాంబినేషన్ లో వచ్చి పలు మూవీలు సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. పంచ్ డైలాగులతో వెంకటేశ్ నోటి నుంచి పలికించి కరెన్సీ కట్టలు కొల్లగొట్టేశారు. టాలీవుడ్ లో ఈ కాంబినేషన్ లో వస్తున్న మూవీకి పేరు పెట్టక ముందే బజ్ పెరిగిందని టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి.
హిట్ కాంబినేషన్ లో....
నువ్వు నాకు నచ్చావ్, మల్లీశ్వరి వంటి సినిమాలు ఇద్దరి కాంబినేషన్ లో హైలెట్ గా నిలిచాయి. అయితే ఈ మూవీకి ఇంకా పేరు పెట్టకపోయినా కథ నచ్చడంతో వెంటనే విక్టరీ వెంకటేశ్ ఓకే చెప్పారు. నిజానికి త్రివిక్రమ్ అల్లు రఅర్జున్, జూనియర్ ఎన్టీఆర్ లతో సినిమాలు తీయాల్సి ఉన్న పరిస్థితుల్లో వారిద్దరికి డేట్స్ కుదరకపోవడంతో వెంకటేశ్ తో వేరే కథతో ఫిక్స్ అయ్యారు. ఆరు పదులు దాటినా యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరోలకు సమానంగా నటిస్తున్న వెంకటేశ్ కు సరిపడా కథను సిద్ధం చేసినట్లు సమాచారం. నిర్మాత నాగవంశీ చెప్పినట్లుగానే ఈ మూవీ త్వరలోనే షూటింగ్ ప్రారంభించబోతున్నారట. బహుశ ఆగస్టు నెలలో ఈ చిత్రం షూటింగ్ ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి.
కామెడీ, కథాబలంతో...
కామెడీ, కథాబలంతోనే ఈ సినిమాను త్రివిక్రమ్ శ్రీనివాస్ తెరకెక్కించనున్నారని టాలీవుడ్ లో టాక్. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు వేగంగాజరుగుతున్నాయి. ఇంకా హీరోయిన్లు, నటుల ఎంపిక పూర్తి కాలేదని తెలుస్తుంది. వచ్చే నెల మొదటి వారంలో ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్ తారగణాన్ని చిత్ర యూనిట్ రివీల్ చేసే అవకాశముందని చిత్ర పరిశ్రమ వర్గాలు తెలిపాయి. అయితే వెంకీ అభిమానులు పండగ చేసుకునేలా మళ్లీ సంక్రాంతికి వచ్చేలా త్రివిక్రమ్ ఈ చిత్ర విడుదలకు ప్లాన్ చే్స్తున్నారని అంటున్నారు. కానీ ఆరు నెలల్లో ఇది సాధ్యమా? అన్నది తేలకపోయినా సంక్రాంతికి అనేక సినిమాలు ఉండటంతో వేసవి విడుదలకు చేసే అవకాశాన్ని కొట్టిపారేయలేమంటున్నారు.