టాలీవుడ్ లో విషాదం.. ప్రముఖ దర్శకుడు కన్నుమూత
టాలీవుడ్ లో విషాదం నెలకొంది. ప్రముఖ దర్శకుడు రవికుమార్ చౌదరి మృతి చెందారు
టాలీవుడ్ లో విషాదం నెలకొంది. ప్రముఖ దర్శకుడు రవికుమార్ చౌదరి మృతి చెందారు. రవికుమార్ చౌదరి గతరాత్రి గుండెపోటుతో ఆకస్మికంగా మరణించారు. గుండెపోటుతో ఆయన తన నివాసంలోనే మరణించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. అయితే రవికుమార్ చౌదరి పలు తెలుగు చిత్రాలకు దర్శకత్వం వహించారు.
పలు చిత్రాలకు...
గోపీచంద్ నటించిన యజ్ఞం సినిమాతో ఆయన తెలుగు చిత్ర పరిశ్రమకు దర్శకుడిగా పరిచయమ్యాడు. తర్వాత రవికుమార్ చౌదరి బాలకృష్ణతో వీరభద్ర సినిమాను, సాయి ధరమ్ తేజ్ పిల్లా నువ్వు లేని జీవితం సినమాను తెరకెక్కించారు. రవికుమార్ చౌదరి చివరి సారిగా తిరగబడరా స్వామి సినిమాకు దర్శకత్వం వహించారు.ఏఎస్ రవికుమార్ మృతి పట్ల తెలుగు చిత్రపరిశ్రమ తీవ్ర సంతాపం ప్రకటించింది.