రవితేజ కుటుంబంలో విషాదం

ప్రముఖ నటుడు రవితేజ కుటుంబంలో విషాదం నెలకొంది. ఆయన తండ్రి రాజగోపాల్‌ రాజు కన్నుమూశారు.

Update: 2025-07-16 09:30 GMT

ప్రముఖ నటుడు రవితేజ కుటుంబంలో విషాదం నెలకొంది. ఆయన తండ్రి రాజగోపాల్‌ రాజు కన్నుమూశారు. ఆయన వయసు 90 సంవత్సరాలు. హైదరాబాద్‌లోని రవితేజ నివాసంలో మంగళవారం రాత్రి రాజగోపాల్‌ రాజు తుదిశ్వాస విడిచారు. ఆయనకు ముగ్గురు కుమారులు కాగా వారిలో రవితేజ పెద్ద కుమారుడు. రెండో కుమారుడు భరత్‌ 2017లో కారు ప్రమాదంలో కన్నుమూశారు. మరో కుమారుడు రఘు నటుడిగా పేరు సంపాదించారు. తూర్పుగోదావరి జిల్లాలో జన్మించిన రాజగోపాల్‌ రాజు ఫార్మాసిస్ట్‌గా విధులు నిర్వర్తించారు. ఉద్యోగరీత్యా ఉత్తర భారతదేశంలో ఎక్కువగా గడిపారు. రాజగోపాల్‌ రాజు మృతిపై సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.

Tags:    

Similar News