సందీప్ కిషన్ కుటుంబంలో విషాదం

టాలీవుడ్ హీరో సందీప్ కిషన్ కుటుంబంలో విషాదం నెలకొంది.

Update: 2025-06-19 05:57 GMT

టాలీవుడ్ హీరో సందీప్ కిషన్ కుటుంబంలో విషాదం నెలకొంది. సందీప్ కిషన్ నానమ్మ అగ్నేసమ్మ మరణించారు. నిన్న విశాఖపట్నంలో తన నానమ్మ మరణించినట్లు సందీప్ కిషన్ తెలిపారు. ఎనభై ఎనిమిదేళ్ల అగ్నేసమ్మ కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ మరణించారు. సందీప్ కిషన్ తన ఇన్ స్టాగ్రామ్ ద్వారా ఈ విషయాన్ని తెలియజేశారు.

ఇద్దరిదీ ప్రేమ వివాహం...
కొన్ని దశాబ్దాల క్రితమే తనతాత, నానమ్మ ప్రేమ వివాహం చేసుకున్నారని, తాతయ్య జోసెఫ్ కృష్ణం నాయుడిగా, నానమ్మఅగ్నెస్ లక్ష్మిగా పేరుమార్చుకున్నారు. కృష్ణం నాయుడు షిప్ ఆర్కిటెక్ట్ గా పనిచేశారు. అగ్నేసమ్మ ఉపాధ్యాయురాలిగా పని చేసి రిటైర్ అయ్యారు. వారిద్దరీ ప్రేమ కథ తనకు స్పూర్తినిచ్చిందని సందీప్ కిషన్ తెలిపారు.


Tags:    

Similar News