హీరో రవితేజ ఇంట విషాదం
మాస్ మహారాజా రవితేజ ఇంట విషాదం నెలకొంది. హీరో రవితేజ తండ్రి రాజగోపాలరాజు మృతి చెందారు
టాలీవుడ్ లో మరో విషాదం నెలకొంది. మాస్ మహారాజా రవితేజ ఇంట విషాదం నెలకొంది. హీరో రవితేజ తండ్రి రాజగోపాలరాజు మృతి చెందారు. ఆయన వయసు 90 సంవత్సరాలు. నిన్న రాత్రి రవితేజ నివాసంలో రాజగోపాలరాజు కన్నుమూసినట్లు తెలిసింది. రవితేజ తండ్రి రాజగోపాలరాజు ఫార్మాసిస్ట్ గా పనిచేశారు. ఫార్మాసిస్టు ఉద్యోగం కావడంతో ఉద్యోగ రీత్యా అనేక ప్రాంతాల్లో తమ కుటుంబం తిరిగిందని రవితేజ పలుమార్లు చెప్పారు.
రవితేజ తండ్రి మరణం...
ఆయనకు ముగ్గురు కుమారులుండగా, అందులో రవితేజ, రఘు, భరత్ రాజులున్నారు. వీరి స్వగ్రామం ఆంధ్రప్రదేశ్ లోని జగ్గంపేట. రవితేజ తండ్రి మృతి పట్ల సినీ ప్రముఖులు సంతాపాన్ని తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి కలిగించాలని కోరారు. రవితేజ ఇంటికి కొందరు సినీ ప్రముఖులు చేరుకుని ఆయనకు తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.