2023 Rewind : ఈ ఏడాది గూగుల్ సెర్చ్‌ టాప్ సినిమాల లిస్టుదే..

ఈ ఏడాది గూగుల్ లో ఎక్కువగా సెర్చ్ చేసిన సినిమాలు ఏంటో తెలుసా..? తెలుగు హీరోలకు సంబంధించిన సినిమాలు ఏమైనా ఉన్నాయా..?

Update: 2023-12-31 13:46 GMT
2023 Rewind : ఈ ఏడాది గూగుల్ లో ఎక్కువగా సెర్చ్ చేసిన సినిమాలు ఏంటో తెలుసా..? ఈ లిస్టులో తెలుగు హీరోలకు సంబంధించిన సినిమాలు ఏమైనా ఉన్నాయా..? ఒకవేళ ఉంటే ఆ చిత్రాలు ఏంటో అనేది ఈ ఆర్టికల్ చదివేసి తెలుసుకోండి..
ఈ ఏడాది టాలీవుడ్ లోని పెద్ద హీరోలు, దర్శకుల నుంచి సినిమాలు రాకపోవడంతో.. పాన్ ఇండియా బాక్స్ ఆఫీస్ వద్ద బాలీవుడ్, కోలీవుడ్ సినిమాల సందడి కనిపించింది. దీంతో గూగుల్ లో సెర్చ్ లో కూడా ఆ సినిమాల హవానే కనిపించింది. ఈ ఏడాది ఇండియా వైడ్ గూగుల్ లో ఎక్కువుగా సెర్చ్ చేసిన సినిమాల లిస్టులో.. షారుఖ్ ఖాన్ 'జవాన్' మూవీ మొదటి స్థానాన్ని దక్కించుకుంది. ఇక ఈ లిస్టులో రెండు స్థానాన్ని కూడా బాలీవుడ్ మూవీ 'గదర్ 2'నే దక్కించుకుంది.
ఆ తరువాత మూడో ప్లేస్ లో హాలీవుడ్ మూవీ 'ఓపెన్‌హైమర్' నిలిచింది. ఆ నెక్స్ట్ నాలుగో స్థానంలో ప్రభాస్ 'ఆదిపురుష్' నిలిచింది. ప్రభాస్ రాముడిగా నటించిన ఈ చిత్రం భారీ అంచనాలు మధ్య రిలీజై ప్లాప్ టాక్ ని సొంతం చేసుకోవడమే కాదు, ఎన్నో విమర్శలు కూడా ఎదుర్కొంది. ఈ సినిమా తరువాత ఐదో స్థానంలో షారుఖ్ 'పఠాన్' నిలువగా 6-10 స్థానాలలో ది కేరళ స్టోరీ, జైలర్, లియో, టైగర్ 3, వరిసు చిత్రాలు నిలిచాయి. ఈ టాప్ లిస్టులో టాలీవుడ్ హీరోకి సంబంధించిన సినిమా ఒక్కటే ఉండడం విశేషం.
అలాగే గ్లోబల్ వైడ్ గూగుల్ సెర్చ్ లో కూడా ఈ ఏడాది తెలుగు సినిమాలు సత్తా చాటలేకపోయాయి. ఈ ఏడాది గ్లోబల్ వైడ్ గూగుల్ సెర్చ్ సినిమాల్లో బార్బీ, ఓపెన్‌హైమర్.. మొదటి రెండు స్థానాల్లో నిలువగా, షారుఖ్ 'జవాన్' మూడో స్థానాన్ని దక్కించుకుంది. ఈ గ్లోబల్ లిస్టులో షారుఖ్ కి సంబంధించి మరో మూవీ 'పఠాన్' కూడా స్థానం దక్కించుకోవడం విశేషం. పదో స్థానంలో 'పఠాన్' నిలిచి షారుఖ్ స్థాయి ఏంటో తెలియజేసింది.
ఇక గ్లోబల్ వైడ్ గూగుల్ సెర్చ్ లో మరో బాలీవుడ్ మూవీ కూడా స్థానం దక్కించుకుంది. సన్నీ డియోల్ గదర్ 2 ఎనిమిదో స్థానాన్ని దక్కించుకుంది. ఇక గ్లోబల్ వైడ్ సెర్చ్ లో కూడా షారుఖ్ కి సంబంధించిన రెండు సినిమాలు ఉండడంతో.. ఇండియన్ సినిమా రియల్ బాద్‌షా, కింగ్ అంటూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.
Tags:    

Similar News