Brahmanandam : బాహుబలితో పోలుస్తూ బ్రహ్మానందాన్ని అవమానించారు..

టాలీవుడ్ నిర్మాత ప్రసాద్ వి పొట్లూరి తన కామెంట్స్ తో బ్రహ్మానందాన్ని అవమానించారంటూ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Update: 2023-12-05 07:09 GMT

Brahmanandam : టాలీవుడ్ స్టార్ కమెడియన్ బ్రహ్మానందం గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఉదయం లేచిన తరువాత సోషల్ మీడియాలో మీమ్ రూపంలోనో, కామెడీ వీడియోస్ రూపంలోనో ఆయనను తప్పకుండా చూడాల్సిందే. వెయ్యకు పైగా సినిమాల్లో నటించిన బ్రహ్మి.. గిన్నిస్ వరల్డ్ రికార్డుని క్రియేట్ చేశారు. పద్మశ్రీ అవార్డుతో పాటు నంది, ఫిలింఫేర్ వంటి పలు ప్రతిష్టాత్మకమైన అవార్డులను కూడా అందుకున్నారు.

ఇక అభిమానం పరంగా అయితే ఆయనకు ఒక సపరేట్ ఫ్యాన్ బేసే ఉంది. ఈ సోషల్ మీడియా, మీమ్ కంటెంట్ వచ్చిన తరువాత అయితే.. ఆయనను మీమ్ గాడ్ అంటూ మీమ్ డే రోజు పూజిస్తున్నారు. వారంతా అంతలా అభిమానించే బ్రహ్మిని టాలీవుడ్ నిర్మాత ప్రసాద్ వి పొట్లూరి (PVP) తన కామెంట్స్ తో అవమానించారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇంతకీ అసలు పివిపి బ్రహ్మి పై ఏ కామెంట్స్ చేశారు..? ఎందుకు చేశారు..?
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చేశాయి. ఈ ఎలక్షన్స్ లో బీఆర్ఎస్‌ పార్టీ ఓటమి పాలవ్వగా కాంగ్రెస్ విజయం సాధించింది. దీని ఉద్దేశిస్తూ పివిపి ఇలా ట్వీట్ చేశారు.. "వాపుకి బలుపుకి తేడా తెలుసుకోకపోతే బాహుబలిని బ్రహ్మానందాన్ని, జననేతను జోకర్ని చేస్తారు ఓటరు మహాశయులు. సర్వజనా సుఖినోభవంతు" అంటూ రాసుకొచ్చారు.
ఆయన ఉద్దేశం ఏంటంటే.. 'మంచి ఏదో చెడు ఏదో తెలుసుకోలేక తెలంగాణ ఓటర్లు బీఆర్ఎస్‌ను ఓడించారని. వాపుకి బలపుకి తేడా తెలుసుకోకుండా బాహుబలి బ్రహ్మానందాన్ని , జననేతను జోకర్ని చేస్తారు' అంటూ చెప్పుకొచ్చారు. పివిపి ఉద్దేశం ఏదైనా అవ్వొచ్చు.. కానీ దానిలోకి బ్రహ్మానందం పేరు లాగడం అభిమానులకు నచ్చలేదు. "బ్రహ్మానందం కంటే బాహుబలి గొప్పోడా? బ్రహ్మానందం ఓమహాత్తర వ్యక్తి, మహానటుడు, బహుముఖప్రజ్ఙాశాలి...‌ మీప్రాసకోసం ఒక మహానుభావుడుని కించపరుస్తారా?" అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.


Tags:    

Similar News