ఘనంగా హీరో శర్వానంద్ నిశ్చితార్థం.. కాబోయే భార్యను పరిచయం చేస్తూ ట్వీట్

దాంతో నెటిజన్లంతా.. నూతన వధూవరులకు శుభాకాంక్షలు చెబుతూ కామెంట్స్ చేస్తున్నారు. కాగా.. యువతి విదేశాల్లో..

Update: 2023-01-26 07:22 GMT

sharwanand engagement photos

టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ హీరోల్లో ఒకరైన శర్వానంద్.. త్వరలోనే పెళ్లిపీటలెక్కనున్నారు. తాజాగా ఆయన రక్షిత అనే యువతితో నిశ్చితార్థం చేసుకున్నారు. శర్వానంద్, యువతి కుటుంబ సభ్యుల సమక్షంలో గురువారం ఉదయం హైదరాబాద్ లోని ఓ హోటల్ లో ఈ జంటకు నిశ్చితార్థం జరిగింది. ఒకరికొకరు ఉంగరాలు తొడుక్కున్నారు. ఈ వేడుకలో శర్వానంద్ బెస్ట్ ఫ్రెండ్ అయిన రామ్ చరణ్, ఉపాసన పాల్గొని, కాబోయే వధూవరులను ఆశీర్వదించి, శుభాకాంక్షలు తెలిపారు.


శర్వానంద్ నిశ్చితార్థానికి సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. తనకు కాబోయే భార్య పేరు రక్షిత అని, ఈ అందమైన యువతితో కొత్త జీవితాన్ని మొదలు పెడుతున్నా అని శర్వానంద్ ట్వీట్ చేశారు. దాంతో నెటిజన్లంతా.. నూతన వధూవరులకు శుభాకాంక్షలు చెబుతూ కామెంట్స్ చేస్తున్నారు. కాగా.. యువతి విదేశాల్లో సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా పనిచేస్తోందని గతంలో వార్తలొచ్చాయి. ప్రస్తుతం ఆమె హైదరాబాద్ లోనే వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తుందని సమాచారం. తనకు కాబోయే భార్య పేరు రక్షిత అని, ఈ అందమైన యువతితో కొత్త జీవితాన్ని మొదలు పెడుతున్నా అని శర్వానంద్ ట్వీట్ చేశారు. "ఒకే ఒక జీవితం" సినిమా తర్వాత.. ఇంతవరకూ శర్వా నెక్ట్స్ ప్రాజెక్ట్ అప్డేట్ లేదు. బహుశా పెళ్లి తర్వాత కొత్త సినిమా అప్డేట్ ఉండొచ్చని తెలుస్తోంది.


Tags:    

Similar News