నేడు, రేపు షూటింగ్ లు బంద్

సూపర్ స్టార్ కృష్ణ మృతికి సంతాప సూచకంగా నేడు, రేపు టాలివుడ్ లో షూటింగ్ ను బంద్ చేస్తూ నిర్మాతల మండలి నిర్ణయం తీసుకుంది

Update: 2022-11-15 04:47 GMT

సూపర్ స్టార్ కృష్ణ మృతికి సంతాప సూచకంగా నేడు, రేపు టాలివుడ్ లో షూటింగ్ ను బంద్ చేస్తూ నిర్మాతల మండలి నిర్ణయం తీసుకుంది. తొలుత నానక్ రామ్ గూడ లోని ఆయన సొంత ఇంటికి పార్ధీవ దేహాన్ని తరలిస్తారు. అక్కడ కాసేపు బంధుమిత్రులు ఆయన పార్ధీవ దేహానికి నివాళులర్పిస్తారు.

గచ్చిబౌలి స్టేడియంలో...
తర్వాత అభిమానుల సందర్శనార్ధం గచ్చిబౌలి స్టేడియానికి తరలిస్తారని తెలిసింది. అభిమానుల సందర్శనం కోసం గచ్చి బౌలి స్టేడియంలో కృష్ణ పార్ధీవ దేహాన్ని ఉంచుతారు. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి వేల సంఖ్యలో అభిమానులు వస్తుండటంతో ఆయన పార్ధీవదేహాన్ని గచ్చిబౌలి స్టేడియంలో ఉంచుతారని తెలిసింది. రేపు కృష్ణ పార్ధీవ దేహానికి అంత్యక్రియలు నిర్వహించే అవకాశముంది.


Tags:    

Similar News