Junior Ntr : ఎంట్రీతోనే అదరగొట్టేస్తాడట.. ఫిదా అవుతున్న జూనియర్ ఫ్యాన్స్
జూనియర్ ఎన్టీఆర్ , ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో వస్తున్న మూవీపై టైటిల్ పై సోషల్ మీడియాలో చర్చ జరుగుతుంది.
జూనియర్ ఎన్టీఆర్ మూవీ టైటిల్ పై సోషల్ మీడియాలో చర్చ జరుగుతుంది. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ మూవీ షూటింగ్ ప్రారంభమయిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పటి వరకూ అనేక అప్ డేట్స్ ఈ మూవీ పై వచ్చినా ఫ్యాన్స్ కు పెద్దగా కిక్కు దొరకలేదు. కానీ తాజాగా ప్రశాంత్ నీల్, జూనియర్ ఎన్టీఆర్ మూవీతో రూపుదిద్దుకుంటున్న మూవీపై అదిరే టైటి్ ను దర్శకుడు ఫిక్స్ చేశానితెలిసింది. అందుతున్న సమాచారం మేరకు ఈ మూవీ టైటిల్ డ్రాగన్ గా పెట్టారని తెలిసింది.
యాక్షన్.. థ్రిల్లర్ మూవీగా...
ఫుల్లు యాక్షన్.. థ్రిల్లర్ మూవీ అయిన ఈ మూవీ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తుండటం సహజమే. అదే సమయలో మాస్ ఎంటర్ టైనర్ గా వస్తునన ఈ మూవీని ప్రశాంత్ నీల్ అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మిస్తుండటంతో ముందుగానే మూవీకి బజ్ క్రియేట్ అయింది. టాలీవుడ్ హిస్టరీలో రికార్డులన్నింటినీ షేక్ చేసే సినిమాగా దీనిని భవిస్తున్నారు. ఈ సినిమా కోసం జూనియర్ ఎన్టీఆర్ తన లుక్ ను కూడా మార్చుకున్నారు. సన్నగా నాజూకుగా తయారైన తారక్ ను చూసి ఫ్యాన్స్ మరింత ఖుషీ అవుతున్నారు.
స్పెషల్ అప్పియరెన్స్ కోసం...
అయితే ప్రశాంత్ నీల్ ఈ మూవీ కోసం అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అందులో భాగంగా జూనియర్ ఎన్టీఆర్ ఎంట్రీతోనే వందకు ఎనభై మార్కులు కొట్టేయాలన్న ఆలోచనతో ఉన్న ప్రశాంత్ నీల్ ఈ మేరకు స్పెషల్ అప్పియరెన్స్ కోసం ప్రత్యేకంగా సెట్స్ వేయిస్తున్నారట. జూనియర్ ఎన్టీఆర్ ఈ మూవీలో కనపడటంతోనే హిట్ టాక్ వచ్చేలా ప్రశాంత్ నీల్ ప్రయత్నిస్నున్నాడట. ఇందుకోసం భారీ సెట్స్ ను డిజైన్ చేసిన ప్రశాంత్ నీల్ ఫ్యాన్స్ ఫిదా అయ్యేలా ఎంట్రీ తోనే బాక్సాఫీసును బద్దలు కొట్టేయాలన్న ప్లాన్ లో ఉన్నారట. మొత్తం మీద జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు ఇది పండగ లాంటి కబురేనని చెప్పాలి