శ్యామ్ సింగ రాయ్ నుంచి "సిరివెన్నెల" పాట

సిరివెన్నెల సీతారామశాస్త్రి రచించిన ఆఖరి పాట ఇదే. మిక్కీ జె మేయర్ స్వరపరిచిన ఈ పాటని అనురాగ్ కులకర్ణి ఆలపించారు

Update: 2021-12-07 13:04 GMT

నేచురల్ స్టార్ నాని - రాహుల్ సాంకృత్యన్ కాంబినేషన్ లో రూపొందిన సినిమా శ్యామ్ సింగ రాయ్. వెంకట్ బోయనపల్లి నిర్మించిన ఈ సినిమాలో నాని సరసన ఉప్పెన హీరోయిన్ కృతి శెట్టి, సాయిపల్లవి, మడోన్నా సెబాస్టియన్ లు కనిపించనున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి "సిరివెన్నెల" లిరికల్ వీడియో పాటను విడుదల చేసింది చిత్ర యూనిట్. "నేలరాజునీ ఇల రాణిని కలిపింది కదా సిరివెన్నెల. దూరమా .. తీరమై చేరుమా. నడిరాతిరిలో తెరలు తెరిచినది .. నడి నిద్దురలో మగత మరిచినది .. ఉదయించినదా కులుకులొలుకు చెలి మొదటి కల" అంటూ సాగే ఈ పాట శ్రోతలను ఆకట్టుకుంటోంది.

ఆఖరి పాట ఇదే....
పాటల రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి రచించిన ఆఖరి పాట ఇదే. మిక్కీ జె మేయర్ స్వరపరిచిన ఈ పాటని అనురాగ్ కులకర్ణి ఆలపించగా.. నాని - సాయిపల్లవి ల మీద చిత్రీకరించారు. సినిమాలో ఫ్లాష్ బ్యాక్ లో ఈ పాట వస్తుందని అభిమానుల అభిప్రాయం. సినిమా విషయానికొస్తే.. శ్యామ్ సింగ రాయ్ లో నాని ఎప్పటిలా కాకుండా.. కాస్త కొత్త లుక్ లో కనిపిస్తున్నాడు. చాలా కాలం క్రితం కోల్ కతాలో ఆచారం పేరిట జరిగిన ఒక దురాచారం చుట్టూ తిరుగుతుంది ఈ కథ. ఆ దురాచారాన్ని అడ్డుకునే సంస్కర్తగా శ్యామ్ సింగరాయ్ పాత్రలో కనిపించనున్నాడు నాని.


Tags:    

Similar News