టికెట్ ధరలు పెంచే ప్రసక్తే లేదు: దిల్ రాజు

తమ్ముడు మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో నిర్మాత దిల్ రాజు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

Update: 2025-06-12 12:15 GMT

తమ్ముడు మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో నిర్మాత దిల్ రాజు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో సినిమా టికెట్ ధరలు పెంచే అవకాశం ఉండదని, సినీ పరిశ్రమలో మార్పు రావాలని దిల్ రాజు అన్నారు. ముఖ్యంగా తన సినిమాలకు టికెట్ ధరలు పెంచాలని అనుకోవడం లేదని, తమ్ముడు చిత్రానికి ధరలు పెంచమని ప్రభుత్వాలను అడగనని నిక్కచ్చిగా చెప్పారు.

ప్రేక్షకులను థియేటర్లకు రప్పించడంపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక సూచనలు చేశారన్నారు. పవన్ కళ్యాణ్ సూచనలను నిర్మాతలంతా తప్పకుండా పాటించాలని కోరారు. ప్రేక్షకులను థియేటర్లకు రప్పించడం నిర్మాతల బాధ్యత.. టికెట్ ధరలు, తినుబండారాలు ప్రేక్షకులకు అందుబాటులో ఉండాలన్నారు దిల్ రాజు. తెలంగాణ మంత్రివర్గ ఉపసంఘం సమావేశంలోనూ ఈ విషయమై చర్చించామని, పవన్ కళ్యాణ్ సూచనలపై తెలంగాణ ప్రభుత్వానికి ప్రతిపాదనలు ఇచ్చానన్నారు దిల్ రాజు.

Tags:    

Similar News