ఏపీలో టికెట్ల పంచాయితీ ఓ కొలిక్కి వచ్చేనా ?

మార్చి 25న ఆర్ఆర్ఆర్, ఫిబ్రవరి 25 లేదా ఏప్రిల్ 1న భీమ్లా నాయక్, మార్చి 11న రాధేశ్యామ్, ఏప్రిల్ 29న ఆచార్య ఇలా వరుసపెట్టి

Update: 2022-02-02 09:55 GMT

ఇప్పుడిప్పుడే కరోనా కంట్రోల్ లోకి వస్తోంది. చిన్న, పెద్ద సినిమాలు వరుసగా విడుదళ్లకు రెడీ అవుతున్నాయి. కానీ ఏపీలో మాత్రం సినిమా టికెట్ల పంచాయితీ ఓ కొలిక్కి రాలేదు. ఇప్పుడున్న టికెట్ల రేట్లే కొనసాగితే.. పెద్ద సినిమాలు గట్టెక్కడం కష్టమేనన్న వాదన బలంగా వినిపిస్తోంది. టికెట్ల రేట్లపై ఇప్పటికే.. ప్రభుత్వం నియమించిన కమిటీ రెండుసార్లు సమావేశమవ్వగా.. ఈరోజు మరోసారి భేటీ అయింది. ఈ భేటీలోనైనా టికెట్ రేట్లపై ప్రభుత్వం ఓ నిర్ణయానికి వస్తుందని అందరూ ఆశగా ఎదురుచూస్తున్నారు. పెద్ద సినిమాల రిలీజ్ ల సమయానికి థియేటర్లలో టికెట్ల ధరలు పెంచుకునే అవకాశం ఇవ్వొచ్చని తెలుస్తోంది.

మార్చి 25న ఆర్ఆర్ఆర్, ఫిబ్రవరి 25 లేదా ఏప్రిల్ 1న భీమ్లా నాయక్, మార్చి 11న రాధేశ్యామ్, ఏప్రిల్ 29న ఆచార్య ఇలా వరుసపెట్టి పాన్ ఇండియా, బడా హీరోల సినిమాలు రిలీజ్ లకు రెడీ అవుతున్నాయి. ఈ మధ్యలో మరికొన్ని చిన్న సినిమాలూ రానున్నాయి. భారీ బడ్జెట్ సినిమాలు కాస్త నిలదొక్కుకోవాలంటే.. ఏపీలో సినిమా టికెట్ల రేట్లను కాస్తైనా పెంచాలని సినీ వర్గాల అభిప్రాయం. ఈ సమస్యకు పరిష్కారం చూపాలని సినీ ఇండస్ట్రీ కోరుతోంది. మరోవైపు ప్రభుత్వం కూడా ఈ సమస్యకు పరిష్కారం చూపేందుకు ప్రయత్నిస్తోంది. మరి కొద్దిసేపట్లో ఏపీలో సినిమా టికెట్ల లొల్లిపై.. ప్రభుత్వం నిర్ణయాలను తెలిపే అవకాశం ఉంది.





Tags:    

Similar News