ఓటును అమ్ముకోవడంపై తలపతి విజయ్ సంచలన వ్యాఖ్యలు

ఓటుకు రూ.1000 చొప్పున లక్షన్నర మందికి రూ.15 కోట్లు ఖర్చు పెడుతున్నారంటే.. దానికి ముందు ఓ రాజకీయ నాయకుడు ఎంత సంపాదించి..

Update: 2023-06-17 12:42 GMT

తలపతి విజయ్ రాజకీయంలోకి వస్తారని ఊహాగానాలు చెలరేగుతున్న నేపథ్యంలో.. తమిళనాడు రాజకీయాలపై హీరో విజయ్ సెటైర్లు వేశారు. చెన్నైలోని ఓకన్వెన్షన్ సెంటర్లో విద్యార్థులతో సమావేశమైన విజయ్.. కాబోయే ఓటర్లు మీరేనన్నారు. ప్రస్తుతం రాజకీయ పరిస్థితి.. మన కన్నుని మన వేలితోనే పొడుచుకున్నట్లు తయారైందని విజయ్ అభిప్రాయపడ్డారు. లంచాలకు లొంగకుండా ఎన్నికలలో ఓటు వేయాలని విద్యార్థులను ప్రోత్సహించారు. లంచం తీసుకోకుండా నిజాయితీగా .. నిబద్ధతతో పనిచేసే ప్రజాప్రతినిధిని ఎన్నుకుంటే.. ఎలాంటి మార్పు వస్తుందో ప్రత్యక్షంగా చూడవచ్చన్నారు.

ఓటుకు రూ.1000 చొప్పున లక్షన్నర మందికి రూ.15 కోట్లు ఖర్చు పెడుతున్నారంటే.. దానికి ముందు ఓ రాజకీయ నాయకుడు ఎంత సంపాదించి ఉంటాడో ఆలోచించాలని సూచించాడు. ఇలాంటి విషయాలను విద్యార్థులకు ఎడ్యుకేషన్ సిస్టమ్ లో పాఠం రూపంలో చెప్పాలని కోరుకుంటున్నానని తెలిపాడు. రాబోయే ఎన్నికల్లో తొలిసారిగా ఓటువేసే విద్యార్థులంతా తమ తల్లిదండ్రులకు కూడా ఓటుకు డబ్బు తీసుకోవద్దని అర్థమయ్యేలా చెప్పాలన్నారు.
ధనుష్ నటించిన అసురన్ సినిమాలో చెప్పిన డైలాగ్.. "మన దగ్గర భూమి ఉంటే తీసుకుంటారు. డబ్బుంటే లాగేసుకుంటారు. కానీ చదువు ఒక్కటే మన నుండి ఎవరూ తీసుకోలేరు" అనే డైలాగ్ ను విజయ్ విద్యార్థులను ఉద్దేశించి చెప్పాడు. సమాజంలో నిరుత్సాహ పరిచే వ్యక్తులు ఎప్పుడూ ఉంటారని, అలాంటి వారి గురించి పట్టించుకోవద్దని సూచించారు. అనంతరం 10, 12 తరగతుల్లో మంచి మార్కులు సాధించిన విద్యార్థులకు విజయ్.. పీపుల్స్ మూవ్ మెంట్ సంస్థ ద్వారా అవార్డులు అందించాడు.




Tags:    

Similar News