కాంతార టీమ్ కి లీగల్ నోటీసులు

కన్నడలో ‘తైక్కుడం బ్రిడ్జ్’ అనే ఓ ప్రైవేట్ మ్యూజిక్ బ్యాండ్ ఉంది. వీరు కొన్ని ప్రైవేట్ ఆల్బమ్స్ ని డిజైన్ చేశారు. గతంలో..

Update: 2022-10-25 09:28 GMT

thaikkudam bridge

రిషబ్ శెట్టి, సప్తమి గౌడ జంటగా తెరకెక్కిన కాంతార సినిమా ప్రపంచవ్యాప్తంగా భారీ విజయాన్నందుకుంది. రూ.20 కోట్ల బడ్జెట్ తో తీసిన ఈ సినిమా ఇప్పటివరకూ సుమారు రూ.150 కోట్ల కలెక్షన్లు వసూలు చేసింది. సాధారణ ప్రేక్షకులే కాదు.. స్టార్ సెలబ్రిటీలు సైతం కాంతార సినిమా చాలా బాగుందంటూ.. ట్వీట్లు చేస్తూ అభినందిస్తున్నారు. విజయవంతంగా దూసుకుపోతున్న కాంతార కు ఇప్పుడొక చిక్కొచ్చిపడింది. ఈ సినిమాలో వాడిన మ్యూజిక్ తమదేనంటూ ఓ ప్రైవేట్ మ్యూజిక్ బ్యాండ్ సోషల్ మీడియాలో పోస్టు పెట్టింది.

కన్నడలో 'తైక్కుడం బ్రిడ్జ్' అనే ఓ ప్రైవేట్ మ్యూజిక్ బ్యాండ్ ఉంది. వీరు కొన్ని ప్రైవేట్ ఆల్బమ్స్ ని డిజైన్ చేశారు. గతంలో వీరు నవరసం పేరుతో ఓ ఆల్బమ్ రిలీజ్ చేశారు. ఈ మ్యూజిక్ కాంతార సినిమాలోని బాగా పాపులర్ అయిన వరాహ రూపం మ్యూజిక్ ఒకేలా ఉందని తైక్కుడం బ్రిడ్జ్ టీమ్ ఆరోపిస్తోంది. దీనిపై తైక్కుడం బ్రిడ్జ్ తమ సోషల్ మీడియాలో అధికారికంగా పోస్ట్ చేస్తూ.. "మా ఆడియన్స్ కి మేము ఒకటే చెప్తున్నాము. కాంతార సినిమాకి మాకు ఎలాంటి సంబంధం లేదు. మా సాంగ్ నవరసం, కాంతార లోని వరాహ రూపం సాంగ్ లో ఉన్న మ్యూజిక్ చాలా వరకు ఒకటే. ఇది పూర్తిగా కాపీ రైట్ చట్టాలని ఉల్లంఘించడమే అవుతుంది. కాపీ కొట్టడం, ఇన్స్పిరేషన్ అని చెప్పడానికి ఈ రెండిటి మధ్య చాలా తేడా ఉంది. ఆ మ్యూజిక్ పూర్తిగా మా సొంతం. అందుకే దీనిపై చట్టపరమైన చర్యలు తీసుకోబోతున్నాం. చిత్ర యూనిట్ కి లీగల్ నోటీసులు పంపిస్తున్నాం" అంటూ.. డైరెక్టర్ రిషబ్ శెట్టి, మ్యూజిక్ డైరెక్టర్ ను ట్యాగ్ చేశారు. ఈ ఆరోపణపై కాంతార టీమ్ ఎలా స్పందిస్తుందో చూడాలి.








Tags:    

Similar News