Tollywood : పద్దెనిమిదో రోజుకు చేరుకున్న టాలీవుడ్ సమ్మె

తెలుగు చిత్ర పరిశ్రమలో సినీ కార్మికుల బంద్ పద్దెనిమిదో రోజుకు చేరుకుంది. నేడు ఫెడరేషన్ ప్రతినిధులకు, సినీ కార్మికులకు మధ్య చర్చలు జరగనున్నాయి

Update: 2025-08-21 04:06 GMT

తెలుగు చిత్ర పరిశ్రమలో సినీ కార్మికుల బంద్ పద్దెనిమిదో రోజుకు చేరుకుంది. నేడు ఫెడరేషన్ ప్రతినిధులకు, సినీ కార్మికులకు మధ్య చర్చలు జరగనున్నాయి. ఇప్పటికే పలు దఫాలు రెండు వర్గాలు చర్చించాయి. తమకు ముప్ఫయి శాతం వేతనాలను పెంచాలని సినీ కార్మికులు డిమాండ్ చేస్తూ సమ్మెకు దిగిన నేపథ్యలో షూటింగ్ లు నిలిచిపోయాయి.

నేటి చర్చల్లో...
అయితే మెగాస్టార్ చిరంజీవి జోక్యంతో ఇరువర్గాలతో విడివిడిగా చర్చలు జరిపారు. వారికి కొన్ని సూచనలు చేశారు. అయితే కేవలం రెండు అంశాలపైనే పీటముడి పడినట్లు తెలిసింది. ఈరోజు జరిగే చర్చల్లో ఈ అంశాలపై క్లారిటీ వచ్చే అవకాశముంది. ఇప్పటికే కార్మికుల సమ్మె పద్దెనిమిదో రోజుకు చేరుకోవడంతో ఇటు నిర్మాతలకు నష్టంతో పాటు కార్మికులు కూడా ఆర్థికంగా అవస్థలు పడుతున్న నేపథ్యంలో సమ్మె విరమించేందుకు అవకాశాలున్నాయంటున్నారు.


Tags:    

Similar News