Tollywood : 14వ రోజుకు చేరిన టాలీవుడ్ సమ్మె
తెలుగు సినీ చిత్ర పరిశ్రమలో బంద్ కొనసాగుతుంది. టాలీవుడ్ సమ్మె పథ్నాలుగో రోజుకు చేరుకుంది
తెలుగు సినీ చిత్ర పరిశ్రమలో బంద్ కొనసాగుతుంది. టాలీవుడ్ సమ్మె పథ్నాలుగో రోజుకు చేరుకుంది. కార్మిక సంఘాలు, నిర్మాతల మండలి మధ్య చర్చలు ఫలించకపోవడంతో సమ్మె కొనసాగుతుంది. మూడు యూనియన్ల విషయంలో వేతనాలు పెంచే అవకాశం లేదని నిర్మాతల మండలి చెప్పేయడంతో సినీ పరిశ్రమలో సమ్మె కొనసాగుతుంది.
నేడు చిరంజీవి వద్దకు...
దీంతోచిరంజీవి దగ్గరకు సినీ పరిశ్రమ బంద్ వ్యవహారం చేరింది. అయితే నేడు కార్మికుల వేతనాలపై మెగాస్టార్ చిరంజీవి చర్చలు జరుపుతారని తెలిసింది. ఈరోజు చిరంజీవితో విడివిడిగా నిర్మాతలు, ఎంప్లాయీస్ ఫెడరేషన్ నేతలు భేటీ కానున్నారు. చిరంజీవి జోక్యం చేసుకోవాలని ఫెడరేషన్ కోరనున్న నేపథ్యంలో చిరంజీవి జోక్యంతో సమస్యపరిష్కారం అవుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.