తమన్నా-విజయ్ వర్మ బ్రేకప్ రూమర్స్.. హోలీ వీడియో వైరల్!

తమన్నా, విజయ్ వర్మ బ్రేకప్ రూమర్స్ చక్కర్లు.. హోలీ వేడుకలకు విడివిడిగా హాజరైన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

Update: 2025-03-15 07:22 GMT

టాలీవుడ్ బ్యూటీ తమన్నా గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రస్తుతం ఆమె ‘ఓదెల-2’ చిత్రంలో నటిస్తోంది. ఇది సూపర్ హిట్ మూవీ ‘ఓదెల రైల్వే స్టేషన్’కు సీక్వెల్‌గా వస్తోంది. ఇటీవల విడుదలైన టీజర్ సినిమాపై ఆసక్తిని పెంచగా, మరోవైపు ఐటెమ్ సాంగ్స్‌లో తన డ్యాన్స్‌తో అభిమానులను ఆకట్టుకుంటోంది.

ఇక తమన్నా వ్యక్తిగత జీవితం విషయానికి వస్తే, బాలీవుడ్ నటుడు విజయ్ వర్మతో ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఈ జంట బ్రేకప్ అయిందంటూ రూమర్స్ వెలువడుతున్నాయి. ఒకరి ఫొటోలు మరొకరు డిలీట్ చేసుకోవడం, వారిద్దరూ ఈ వార్తలపై స్పందించకపోవడం చర్చనీయాంశంగా మారింది.

ఇలాంటి నేపథ్యంలో, హోలీ పండుగ సందర్భంగా బాలీవుడ్ నటి రవీనా టాండన్ ఇంట్లో జరిగిన వేడుకలకు తమన్నా, విజయ్ వర్మ హాజరయ్యారు. అయితే వీరిద్దరూ విడివిడిగా రావడం గమనార్హం. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వీరిద్దరూ కలిసి హోలీ జరుపుకున్నారా లేదా అన్నది తెలియాల్సి ఉంది.



Tags:    

Similar News