తమన్నా భాటియా తళుకులు.. కేన్స్ లో ఇండియన్ స్టార్స్

తమన్నా భాటియా.. పరిచయం అక్కర్లేని సెలెబ్రిటీ..! దక్షిణాది లోనూ.. బాలీవుడ్ లోనూ ఆమె తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును అందుకుంది. ఇటు దక్షిణాదిన సినిమాలు చేస్తూనే ఓటీటీ లోనూ తన ట్యాలెంట్ ను చూపిస్తూ ఉంది తమన్నా భాటియా. ఇక ఆమె ఫ్యాషన్ గురించి కూడా ప్రత్యేకంగా చెప్పుకోవాలి.

Update: 2022-05-18 15:10 GMT

తమన్నా భాటియా.. పరిచయం అక్కర్లేని సెలెబ్రిటీ..! దక్షిణాది లోనూ.. బాలీవుడ్ లోనూ ఆమె తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును అందుకుంది. ఇటు దక్షిణాదిన సినిమాలు చేస్తూనే ఓటీటీ లోనూ తన ట్యాలెంట్ ను చూపిస్తూ ఉంది తమన్నా భాటియా. ఇక ఆమె ఫ్యాషన్ గురించి కూడా ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఎందుకంటే ఎప్పటికప్పుడు వెరైటీ దుస్తులను ఆమె ట్రై చేస్తూ ఉంటుంది. తమన్నా భాటియా తన ఫ్యాషన్ సెన్స్ తో ఎంతో మందికి ఇన్స్పిరేషన్ గా ఉంటుంది. ఎలాంటి బట్టలు వేసుకున్నా ఆత్మవిశ్వాసం ముఖ్యమని ఆమె చెబుతూ ఉంటుంది. తన డ్రెస్సింగ్ లో ప్రయోగాలు చేయడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది తమన్నా. ప్రస్తుతం కేన్స్ ఫిలిం ఫెస్టివల్ లో సందడి చేస్తోంది తమన్నా. కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ మే 28 వరకు జరుగుతుంది. ఐశ్వర్య రాయ్ బచ్చన్, హీనా ఖాన్, తమన్నా భాటియా, నవాజుద్దీన్ సిద్ధిఖీ, A R రెహమాన్, పూజా హెగ్డే, R మాధవన్‌తో సహా ఇతర తారలు రెడ్ కార్పెట్‌పై నడుస్తున్నారు.

కేన్స్‌లో అరంగేట్రం చేసిన తమన్నా భాటియా మాట్లాడుతూ " కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో నా మొదటి అడుగు, కాబట్టి నేను చాలా ఉత్సాహంగా ఉన్నాను. బాహుబలి లాంటి సినిమా ఈరోజు భారతదేశంలో సినిమాలను చూసే విధానాన్ని మార్చేసింది. ఇది పాన్ ఇండియా చిత్రాలకు విండోను తెరిచింది. భారతదేశం సినిమాకి చాలా సహకారం అందించింది. దీపిక పదుకోన్ జ్యూరీలో భాగం కావడం ఎంతో గర్వకారణంగా ఉంది.. నాలాంటి నటీనటులకు నువ్వే స్ఫూర్తి." అని చెప్పుకొచ్చింది.

కేన్స్ రెడ్ కార్పెట్ పై నడిచిన తొలి భారత జానపద కళాకారుడిగా రాజస్థానీ సింగర్ మామే ఖాన్ చరిత్ర సృష్టించారు. కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ నేతృత్వంలోని భారత బృందంలో సభ్యుడిగా కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో మామే ఖాన్ పాల్గొన్నారు. కేన్స్ రెడ్ కార్పెట్ పై మామే ఖాన్ సంప్రదాయ రాజస్థానీ వేషధారణలో అలరించాడు. ఆ డ్రెస్ ను ప్రముఖ డిజైనర్ అంజులీ చక్రవర్తి రూపొందించారు.
Tags:    

Similar News