"స్వాగ్ ఆఫ్ భోళా".. మెగా మాస్ సాంగ్ ప్రోమో విడుదల

మెహర్ రమేష్ దర్శకత్వంలో రూపొందుతున్న భోళాశంకర్ ప్రధాన ఘట్టానికి సంబంధించిన షూటింగ్ ను పూర్తిచేసుకుంది. తాజాగా న్యూ ఇయర్

Update: 2022-01-01 05:11 GMT

మెగాస్టార్ చిరంజీవి వరుస సినిమా ప్రాజెక్టులతో బిజీబిజీగా ఉంటున్నారు. ఆచార్య, భోళాశంకర్ ప్రాజెక్టుల పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. మెహర్ రమేష్ దర్శకత్వంలో రూపొందుతున్న భోళాశంకర్ ప్రధాన ఘట్టానికి సంబంధించిన షూటింగ్ ను పూర్తిచేసుకుంది. తాజాగా న్యూ ఇయర్ సందర్భంగా భోళా శంకర్ మేకర్స్ మెగా మాస్ సాంగ్ ప్రోమోను విడుదల చేశారు. స్వాగ్ ఆఫ్ భోళా పేరుతో వచ్చిన ఈ ప్రోమోలో చిరంజీవి తన ముఖాన్ని చేతితో కప్పుకున్నట్లు కనిపిస్తోంది. మెగాస్టార్ స్టైలిష్ హెయిర్‌డోతో పోస్టర్‌లో కనువిందు చేశాడు. న్యూ ఇయర్ సందర్భంగా విడుదల చేసిన ఈ ప్రోమో.. మెగా అభిమానుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతోంది.

Also Read : బిగ్ బాస్ 6 : తెరపైకి జబర్దస్త్ ఆర్టిస్ట్ పేరు.. ఆమె ఒప్పుకుందా ?

మహతి స్వర సాగర్ అద్భుతమైన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో చిరంజీవికి మెగా ఎలివేషన్ ఇచ్చారు. ఈ యువ సంగీత దర్శకుడు తన సరికొత్త ట్రాక్స్.. స్కోర్ లతో మెగా అభిమానులను ఆకట్టుకునేందుకు తెగ కష్టపడుతున్నాడట. మోషన్ పోస్టర్ ప్రోమో బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ వింటే.. ఆ విషయం అర్థమవుతోంది. తమిళ సినిమా లూసిఫర్ కు రీమేక్ గా వస్తున్న భోళాశంకర్ సినిమాలో మిల్కీ బ్యూటీ తమన్నా చిరంజీవితో జతకడుతుండగా.. కీర్తి సురేష్ చిరంజీవికి చెల్లెలి పాత్రలో నటిస్తోంది. ఈ సినిమాను ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ నిర్మిస్తోంది.

Full View
Tags:    

Similar News