అనుపమ-కేంద్ర మంత్రి సురేష్ గోపి సినిమా విడుదలవ్వడం లేదు

నటుడు-రాజకీయ నాయకుడు సురేష్ గోపి, అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రలలో

Update: 2025-06-23 05:36 GMT

Suresh Gopi

నటుడు-రాజకీయ నాయకుడు సురేష్ గోపి, అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రలలో నటించిన జానకి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ (JSK) సినిమా విడుదలను సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC) తిరస్కరించడంతో సినిమా విడుదలను వాయిదా వేశారు. ప్రవీణ్ నారాయణన్ దర్శకత్వం వహించిన ఈ కోర్ట్ రూమ్ థ్రిల్లర్ జూన్ 27న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కావాల్సి ఉంది. ఈ సినిమాని సెన్సార్ బోర్డు ప్రదర్శించడానికి నిరాకరించిందని, జూన్ 27న విడుదల లేదని చిత్ర యూనిట్ తెలిపింది.

జానకి పేరును తొలగించాలని డిమాండ్ చేస్తూ CBFC సినిమా టైటిల్‌పై అభ్యంతరం వ్యక్తం చేసినట్లు సమాచారం. టైటిల్‌ను మార్చడం సరైనది కాదని పేర్కొంటూ నిర్మాతలు నిరాకరించారు. ఈ సినిమా ఇంతకుముందు సర్టిఫికేషన్ ఫార్మాలిటీలను పూర్తి చేసి, ఎటువంటి కోతలు లేకుండా U/A 13+ రేటింగ్‌ను పొందినప్పటికీ, ఇప్పుడు దానికి పబ్లిక్ ఎగ్జిబిషన్‌కు అనుమతి నిరాకరించారు. ఫిల్మ్‌ ఎంప్లాయిస్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ కేరళ ప్రధాన కార్యదర్శి, ప్రముఖ దర్శకుడు ఉన్ని కృష్ణన్‌ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. సినిమాలో జానకి అనే పేరును ఉపయోగించరాదని సెన్సార్‌ బోర్డు ఈ చిత్ర నిర్మాతలకు స్పష్టంగా తెలియజేసినట్లు చెప్పారు. టైటిల్‌, పాత్ర పేరును మార్చాలని బోర్డు చిత్రబృందానికి సూచించినట్లు తెలిపారు.


Tags:    

Similar News