Rajinikanth : రిషికేశ్ లో రజనీకాంత్
సూపర్ స్టార్ రజనీకాంత్ హిమాలయ పర్యటనకు వెళ్లారు. మధ్యలో ఆధ్యాత్మిక ప్రదేశాలను కూడా ఆయన సందర్శిస్తున్నారు.
సూపర్ స్టార్ రజనీకాంత్ హిమాలయ పర్యటనకు వెళ్లారు. మధ్యలో ఆధ్యాత్మిక ప్రదేశాలను కూడా ఆయన సందర్శిస్తున్నారు. రిషికేశ్ లో ఆధ్యాత్మిక యాత్ర సందర్భంగా రోడ్డు పక్కన అల్పాహారం తిన్న రజినీకాంత్ ఫొటోలు సోషల్ మీడీయాలో వైరల్ గా మారాయి. స్నేహితులతో కలిసి హిమాలయాల పర్యటనలో ఉన్న ప్రముఖ సినీ నటుడు రజనీకాంత్ సోమవారం బద్రీనాథ్ ఆలయాన్ని సందర్శించారు.
సింపుల్ గా...
ఆయన దేవాలయానికి వెళ్తున్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఆదివారం రిషికేశ్ ను సందర్శించిన రజినీ కాంత్ అంతకుముందు రోడ్డు పక్కన సాదాసీదాగా అల్పాహారం తిన్నారు. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. రజినీ సింప్లిసిటీకి మారుపేరు అంటూ అభిమానులు, నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. రజనీకాంత్ ప్రతి ఏడాది హిమాలయాలకు వెళ్లి కొన్ని రోజులు గడిపి వస్తారు. అందులో భాగంగానే ఆయన అక్కడకు వెళ్లి కొంత రిలాక్స్ అయి తిరిగి వచ్చి సినిమా షూటింగ్ లలో పాల్గొంటారు.