సునీల్ కు షాకిచ్చారా..?

ఒరిజిన‌ల్ ర‌న్ టైం మాత్రం 2 గంట‌ల 45 నిమిషాలు ఉంద‌ట‌. సినిమా బోర్ కొట్టకుండా.. మిగిలిన పార్టును తొలగించార‌ని

Update: 2022-07-24 07:58 GMT

అక్కినేని నాగ‌చైత‌న్య హీరోగా న‌టించిన చిత్రం థ్యాంక్యూ. విక్రమ్ కే కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ఈ మూవీలో రాశీఖన్నా, మాళ‌వికా నాయ‌క్‌, అవికాగోర్‌, హీరోయిన్లుగా న‌టించారు. జులై 22న ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన ఈ చిత్రానికి సంబంధించిన ఓ ఆస‌క్తికర విష‌యం వైరల్ అవుతోంది. ఈ సినిమా ర‌న్‌టైం 129 నిమిషాలు. ఒరిజిన‌ల్ ర‌న్ టైం మాత్రం 2 గంట‌ల 45 నిమిషాలు ఉంద‌ట‌. సినిమా బోర్ కొట్టకుండా.. మిగిలిన పార్టును తొలగించార‌ని అంటున్నారు. సినిమా పోస్ట‌ర్‌లో క‌నిపించిన సునీల్.. సినిమాలో క‌నిపించ‌లేదు. డిలీటెడ్ వెర్ష‌న్‌లోనే సునీల్‌కు సంబంధించిన స‌న్నివేశాలు ఎగిరిపోయార‌ని అంటున్నారు.

'లవ్ స్టోరీ', 'బంగార్రాజు' చిత్రాలతో మంచి సక్సెస్ ను అందుకున్న నాగచైతన్య.. థ్యాంక్యూ సినిమా కూడా హిట్ అవుతుందని ఆశించారు. బాక్సాఫీస్ వద్ద ఈ మూవీ కలెక్షన్స్ తొలిరోజు మరీ దారుణంగా ఉన్నాయి. నాగచైతన్య కేరీర్ లోనే 'థ్యాంక్ యూ' మూవీ కలెక్షన్స్ పరిస్థితి ఘోరంగా ఉంది. గత చిత్రాలతో పోల్చితే భారీ విఫలమని తెల్చుతోంది. ఫస్ట్ డే కలెక్షన్స్.. తెలంగాణ, ఏపీలో కేవలం రూ.1.65 కోట్లు మాత్రమే కలెక్ట్ చేసింది. ఇప్పటికే ప్రీ రిలీజ్ బిజినెస్ రూ.20 కోట్లకు పైగా అయినట్టు తెలుస్తోంది. థ్యాంక్యూ చిత్రం ప్రపంచవ్యాప్తంగా కేవలం రూ.2.16 కోట్ల షేర్ వసూళ్లు మాత్రమే రాబట్టింది. చైతూ కెరీర్ లో ఇటీవల ఇంత తక్కువ వసూళ్లు రాబట్టిన చిత్రంగా 'థ్యాంక్యూ' నిలిచింది.
నాగచైతన్య గత ఆరు చిత్రాల తొలిరోజు కలెక్షన్స్ ను చూస్తే.. శైలజారెడ్డి అల్లుడు - రూ.6.93 కోట్లు, సవ్యసాచీ - రూ.3.29 కోట్లు, మజిలి - రూ.5.6 కోట్లు, రూ.వెంకీ మామా - రూ.7.05, లవ్ స్టోరీ - రూ.7.13 కోట్లు సాధించగా.. చివరిగా వచ్చిన బంగార్రాజు చిత్రం కూడా రూ.9.06 కోట్లు సాధించింది.
ఈ సినిమా తొలిరోజు వసూలు చేసిన కలెక్షన్స్ ఏరియాల వారీగా ఈ విధంగా ఉన్నాయి.
నైజాం – 0.72 కోట్లు
సీడెడ్ – 0.20 కోట్లు
ఈస్ట్ – 0.14 కోట్లు
వెస్ట్ – 0.08 కోట్లు
ఉత్తరాంధ్ర – 0.22 కోట్లు
గుంటూరు – 0.10 కోట్లు
కృష్ణా – 0.12 కోట్లు
నెల్లూరు – 0.07 కోట్లు
కర్ణాటక+రెస్టాఫ్ ఇండియా – 0.06 కోట్లు
ఓవర్సీస్ – 0.45 కోట్లు
టోటల్ వరల్డ్ వైడ్ – రూ.2.16 కోట్లు (రూ.3.70 కోట్లు గ్రాస్)


Tags:    

Similar News