పుష్ప 2 రిలీజ్ డేట్ వచ్చేసింది..

బాక్సాఫీస్ వద్ద పుష్ప గాడి రూలింగ్ కి టైం ఫిక్స్ అయ్యింది. వచ్చే ఏడాది..

Update: 2023-09-11 11:09 GMT

అల్లు అర్జున్ (Allu Arjun) నటిస్తున్న పుష్ప 2 (Pushpa 2) రిలీజ్ డేట్ కోసం పాన్ ఇండియా వైడ్ ఫ్యాన్స్ ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. పార్ట్-1 రిలీజ్ అయ్యి ఏడాదిన్నర అవుతున్నా ఇప్పటివరకు చిత్ర యూనిట్ మాత్రం విడుదల తేదీపై ఒక క్లారిటీ ఇవ్వడం లేదు. ఆ మధ్య రిలీజ్ డేట్ పై అప్డేట్ ఇవ్వాలంటూ అభిమానులు గీతా ఆర్ట్స్, మైత్రీ మూవీ మేకర్స్ ఆఫీస్ ఎదుట నిరసన తెలిపిన సంగతి తెలిసిందే.

కానీ మేకర్స్ నుంచి మాత్రం ఎటువంటి రెస్పాన్స్ రాలేదు. ఇక ఇటీవల ఈ మూవీకి నేషనల్ అవార్డులు రావడంతో.. మూవీ టీం ప్రమోషన్ స్ట్రాటజీని మొదలు పెట్టింది. ఈక్రమంలోనే ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న రిలీజ్ డేట్ గురించి అప్డేట్ ఇచ్చారు. 2024 ఆగష్టు 15 నుంచి బాక్సాఫీస్ వద్ద పుష్ప గాడి రూల్ మొదలవుతుంది అంటూ మేకర్స్ అధికారికంగా తెలియజేశారు.

పార్ట్-1 తో వచ్చిన హైప్, నేషనల్ అవార్డుతో వచ్చిన హైప్ తో.. ఓపెనింగ్ లోనే పుష్ప 2 బాక్స్ ఆఫీస్ వద్ద భారీ కలెక్షన్స్ నమోదు చేయడం ఖాయం అంటున్నారు. ముఖ్యంగా ఈ సినిమా పై నార్త్ ఆడియన్స్ ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. దీంతో ఈ చిత్రం బాలీవుడ్ లో సరికొత్త రికార్డులను సృష్టించడంలో సందేహం లేదని సినీ పండితులు చెబుతున్నారు. ఇక ఈ అంచనాలకు తగ్గట్టే దర్శకుడు సుకుమార్ కూడా పార్ట్2 ని సిద్ధం చేస్తున్నాడు.

ఇటీవల ఈ మూవీ సెట్స్ నుంచి బయటకి వచ్చిన ఒక వీడియోలో 100కు పైగా లారీలు కనిపించడంతో.. మూవీలో భారీ యాక్షన్ ఛేజ్ సీక్వెన్స్ ఉండబోతుందని అభిమానులు అంచనాలు వేసేసుకుంటున్నారు. కాగా ఈ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుంటే ఫహద్ ఫాజిల్ ప్రతినాయకుడు పాత్రలో కనిపించబోతున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.

 

Tags:    

Similar News