Allu Arujun : బన్నీ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. ఇక స్క్రీన్ చినిగి పోవాల్సిందే

కోలివుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటిస్తున్న మూవీ లో స్టార్ హీరో ఎంట్రీ ఇచ్చాడట

Update: 2025-08-21 06:47 GMT

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మూవీ అంటే రోమాలు నిక్కబొడుచుకుంటాయి. పాటలు, ఫైట్స్ తో పాటు టైమింగ్ తో అలరించే నటుడిగా బన్నీ అశేష ప్రేక్షకాదరణను పొందాడు. పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా ఎదిగిన అల్లు అర్జున్ తదుపరి మూవీ కోసం అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఇప్పటికే కోలివుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో మూవీ సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాపై తొలి నుంచి అంచనాలు భారీగా ఉన్నాయి. మేకర్స్ కూడా అదే రేంజ్ లో ఫ్యాన్స్ కు అప్ డేట్స్ ఇస్తూ వస్తున్నారు.

కొత్త గెటప్ లో...
సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ మూవీలో దీపికా పడుకోనే, మృణాల్ ఠాకూర్ లు హీరోయిన్ లుగా నటిస్తున్నారన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాతో మరో పాన్ ఇండియా మూవీని తీసుకు వద్దామనుకుంటున్న వారు ఎప్పటికప్పుడు క్యారెక్టర్ల ఎంపికలోనూ అంతే జాగ్రత్తలు పాటిస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీకి సంబంధించి అనేక మందికి లుక్ టెస్ట్ లను కూడా నిర్వహించి ఫైనల్ చేశారు. ఈ మూవీలో అల్లు అర్జున్ కొత్త గెటప్ లో కనిపించనున్నారు. పుష్ప సినిమాలో గుబురు గడ్డంతో కనిపించిన బన్నీ ఈ మూవీలో లుక్ అదరిపోతుందని అంటున్నారు.
2027లోనే విడుదల...
అయితే తాజాగా వస్తున్న సమాచారం మేరకు మరో స్టార్ హీరోను ఈ మూవీకి ఎంపిక చేశారని తెలిసింది. తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతి కూడా ఈ సినిమాలో నటించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే విజయ్ సేతుపతి ఏ క్యారెక్టర్ చేస్తారన్నది మాత్రం ఆసక్తికరంగా మారింది. విజయ్ సేతుపతి ఇప్పటికే సినిమా సెట్స్ లో జాయిన్ అయినట్లు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ షూటింగ్ ఇప్పటికే ప్రారంభమయింది. ముంబయిలో జరుగుతున్న షూటింగ్ శరవేగంగా కొనసాగుతుంది. ఈ మూవీ షూటింగ్ వచ్చే ఏడాది సెప్టంబరు వరకూ కొనసాగుతుంది. చిత్రం విడుదల మాత్రం 2027లోనే అని మేకర్స్ ఇప్పటికే చెప్పినట్లు కూడా వార్తలు వైరల్ అవుతున్నాయి. సో.. బన్నీ ఫ్యాన్స్ మాత్రం మరో ఏడాదిన్నర ఈ సినిమా కోసం వెయిట్ చేయాల్సిందే.


Tags:    

Similar News