SSMB 29 : మహేశ్ బాబు అభిమానులను ఊరించే వార్త

ప్రిన్స్ మహేశ్ బాబు అభిమానులకు త్వరలో గుడ్ న్యూస్ అందనుంది.

Update: 2025-10-21 06:27 GMT

ప్రిన్స్ మహేశ్ బాబు అభిమానులకు త్వరలో గుడ్ న్యూస్ అందనుంది. ఫ్యాన్స్ ఊగిపోయేలా ఈ న్యూస్ అందనుందని టాక్. సూపర్ స్టార్ మహేశ్ బాబు దర్శకుడు రాజమౌళి దర్శకత్వంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. SSMB 29 గా వర్కింగ్ టైటిల్ తో ఇప్పటికే అందరినీ ఊరిస్తుంది. రాజమౌళి మూవీ అంటే షూటింగ్ ప్రారంభానికి ముందు నుంచే హైప్ క్రియేట్ అవుతుంది. గత రికార్డులను బద్దలు కొట్టేలా ఈ మూవీని రూపొందిస్తారని అందరూ భావిస్తారు. అందుకే రాజమౌళి, మహేశ్ బాబు కాంబినేషన్ లో వస్తున్న ఈ మూవీకి ఇప్పటికే బజ్ క్రియేట్ అయింది.

అధికారిక ప్రకటన వచ్చే నెలలో...
మేకింగ్ లో రాజమౌళిది ప్రత్యేక స్టయిల్. ఏదీ అంత త్వరగా ఒప్పుకోరు. సీన్ ల మీద సీన్లు చేసేస్తుంటారు. తాను నచ్చేంత వరకూ సీన్ వచ్చేంత వరకూ రాజమౌళి శ్రమిస్తారు. చిత్రంలో నటీనటులను కూడా అలాగే వంచేస్తారు. అయితే SSMB 29 సినిమా షూటింగ్ ఇటీవల ఒడిశాలో చేశారు. కోరాపుట్ జిల్లాలో జరిగిన షూటింగ్ కు సంబంధించిన కొన్ని సీన్లు కూడా సోషల్ మీడియాలో కనిపించాయి. అయితే SSMB 29 మూవీకి సంబంధించిన అధికారిక ప్రకటన ఇప్పటి వరకూ విడుదల కాలేదు. నవంబర్ లో విడుదల చేస్తామని ప్రకటించారు.
టైటిల్ తో పాటు గ్లింప్స్ కూడా...
త్వరలోనే SSMB 29 మూవీకి సంబంధించిన లేటెస్ట్ అప్ డేట్ రాజమౌళి అఫీషియల్ గా అనౌన్స్ చేస్తారంటున్నారు. ఈ అప్ డేట్ కోసం ఒక ఈవెంట్ ను కూడా చేయాలని మేకర్స్ నిర్ణయించారు. హైదరాబాద్ లో జరిగే ఈవెంట్ లో SSMB 29 మూవీకి సంబంధించిన అప్ డేట్ ఇస్తారన్నది చిత్ర పరిశ్రమ ద్వారా వినిపిస్తున్న టాక్. అయితే ఈ అప్ డేట్ లో ఏముంటుందన్నది మాత్రం ఇంకా లీక్ కాకపోయినప్పటికీ, టైటిల్ అయి ఉండవచ్చన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. టైటిల్ తో పాటు గ్లింప్స్ ను కూడా ఈ ఈవెంట్ లో విడుదల చేసే అవకాశముందని తెలిసింది. మొత్తం మీద మహేశ్ బాబు ఫ్యాన్స్ ను ఎన్నాళ్ల నుంచో ఊరిస్తున్న సమయం రానే వచ్చింది.




















Tags:    

Similar News