Slipper Attack: ఇళయ తలపతి విజయ్ పై చెప్పుతో దాడి
దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో వైరల్ అవుతుంది
Slipper thrown on Thalapathy
లెజెండరీ నటుడు, దేశీయ ముర్పోక్కు ద్రావిడ్స్ కజగం (DMDK) అధినేత, విజయకాంత్ చెన్నైలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో మరణించారు. విజయకాంత్‌కు నివాళులు అర్పించేందుకు ఇళయ తలపతి విజయ్ చెన్నైలోని DMDK కార్యాలయానికి వచ్చారు. ఆ సమయంలో కొందరు ఆయనపై (Slipper attack)దాడికి పాల్పడ్డారు. ఒకరు అతనిపై తన చెప్పు విసిరినట్లు కనిపించింది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో వైరల్ అవుతుంది. విజయ్ చుట్టూ జనం గుమిగూడగా.. మధ్యలో నుంచి ఓ చెప్పు వచ్చి ఆయనకు తగిలినట్లు వీడియోలో కనిపిస్తోంది. విజయ్ దానిని పట్టించుకోకుండా కారు ఎక్కడానికి వెళ్లారు. పక్కనే ఉన్న వ్యక్తి ఆ చెప్పును అది వచ్చిన దిశలోకే విసిరేశాడు. ఈ అంత్యక్రియల్లో విజయ్ ని ఎందుకు లక్ష్యంగా చేసుకున్నారన్న విషయం తెలియలేదు. విజయకాంత్‌కు నివాళులర్పించిన సందర్భంగా తలపతి విజయ్ కన్నీటిపర్యంతమయ్యారు. విజయకాంత్ భార్య ప్రేమలత, ఇద్దరు కుమారులు విజయ ప్రభాకరన్, షణ్ముగ పాండియన్‌లను ఆయన ఓదార్చారు.