Tollywood : పన్నెండో రోజుకు చేరుకున్న టాలీవుడ్ బంద్
తెలుగు సినీ చిత్ర పరిశ్రమలో షూటింగ్స్ బంద్ పన్నెండో రోజుకు చేరుకుంది. ఫిలిం ఎంప్లయీస్ ఫెడరేషన్, నిర్మాతల మండలి మధ్య జరిగిన చర్చలు విఫలమయ్యాయి
తెలుగు సినీ చిత్ర పరిశ్రమలో షూటింగ్స్ బంద్ పన్నెండో రోజుకు చేరుకుంది. ఫిలిం ఎంప్లయీస్ ఫెడరేషన్, నిర్మాతల మండలి మధ్య జరిగిన చర్చలు విఫలమయ్యాయి. కార్మికుల డిమాండ్లలో కొన్నింటిని అంగీకరించి, మరికొన్నింటికి అంగీకరించకపోవడంతో చర్చలు కొలిక్కి రాలేదు. రేపు కూడా నిర్మాతలతో కార్మిక సంఘాల చర్చలు జరగనున్నాయి.
మూడు విభాగాలకు...
ప్రధానంగా ఫైటర్స్, డ్యాన్సర్స్, టెక్నీషియన్స్ కు వేతనాలను పెంచే అవకాశం లేదని నిర్మాతలు తేల్చి చెప్పారు. ఆ మూడు యూనియన్ల మినహా మిగిలిన అన్ని యూనియన్ సభ్యులకు రెండు వేలు లోపు ఉన్న కార్మికులకు మూడు సంవత్సరాలుకు ఇరవై ఐదు శాతం వేతనాలను పెంచుతామని చెప్పారు. అయితే నిర్మాతల షరతులకు కార్మిక సంఘాలు అంగీకరించకపోవడంతో చర్చలు కొలిక్కి రాలేదు. దీంతో సమ్మె యధాతధంగా కొనసాగుతుంది. రేపయినా చర్చలు కొలిక్కి వచ్చే అవకాశం ఉందా? లేదా? అన్నది తేలనుంది.