సిద్ధార్థ్‌ని క్షమాపణలు కోరుతున్న కన్నడ స్టార్స్.. అసలు ఏమైంది..?

కర్ణాటకలోని బెంగళూరులో ఒక ప్రెస్ మీట్ లో పాల్గొన్న సిద్ధార్థ్ కి చేదు అనుభవం ఎదురైంది. ఇక ఈ విషయంపై స్పందిస్తూ కన్నడ స్టార్స్..

Update: 2023-09-29 12:35 GMT

బొమ్మరిల్లు, నువ్వొస్తానంటే నేనొద్దంటానా, ఓయ్ వంటి సినిమాలతో యూత్ లో మంచి క్రేజ్ సంపాదించుకున్న నటుడు 'సిద్ధార్థ్'. ప్రస్తుతం తమిళ పరిశ్రమలో వరుస సినిమాలు చేస్తూ వస్తున్న సిద్ధార్థ్.. రీసెంట్ గా 'చిత్త' అనే సినిమాలో నటించాడు. ఇక ఈ మూవీ ప్రమోషన్స్ లో ఉన్న సిద్ధార్థ్ రీసెంట్ గా కర్ణాటకలోని బెంగళూరులో ఒక ప్రెస్ మీట్ నిర్వహించాడు. అయితే ఈ కార్యక్రమంలో సిద్ధార్థ్ కి చేదు అనుభవం ఎదురైంది.

దశాబ్దాల కాలంగా కావేరీ నదీజలాల వివాదం కొనసాగుతూనే వస్తుంది. ఇప్పుడు ఈ వివాదం ప్రభావం సినిమాలు పై కూడా పడుతుంది. బెంగళూరులో సిద్ధార్థ్ ప్రెస్ మీట్ నిర్వహిస్తున్న సమయంలో నిరసనకారులు వచ్చి అడ్డుకున్నారు. ప్రెస్ మీట్ లో నిరసన తీవ్రతరం అవుతుండడంతో సిద్ధార్థ్.. అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఈ విషయం ఇప్పుడు తమిళనాడు, కర్ణాటకలో హాట్ టాపిక్ అయ్యింది. సిద్ధార్థ్ కి జరిగిన దానికి కన్నడ సినీ పరిశ్రమలోని ప్రముఖులు క్షమాపణలు చెబుతూ వస్తున్నారు.
విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ ఈ విషయం పై స్పందిస్తూ ఒక ట్వీట్ చేశాడు. "దశాబ్దాల కాలంగా ఈ సమస్యను పరిష్కరించడంలో రాజకీయ పార్టీలు, నేతలు విఫలమయ్యారు. వారిని ప్రశ్నించడం మానేసి సామాన్యులు, కళాకారులను ఇబ్బంది పెట్టడం అసలు కరెక్ట్ కాదు. జరిగిన విషయంలో హీరో సిద్ధార్థ్ కి.. కన్నడికుల తరపున ఒక కన్నడికుడిగా నేను క్షమాపణలు చెబుతున్నాను" అంటూ ట్వీట్ చేశాడు.
ఇక కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ కూడా ఈ విషయం పై స్పందించాడు. "కన్నడ పరిశ్రమ నుంచి సిద్ధార్థ్‌కు నేను క్షమాపణలు చెబుతున్నాను. ప్రెస్ మీట్ లో అలా జరగడం నన్ను ఎంతో బాధించింది. ఇలాంటి తప్పు మళ్ళీ జరగదు. కన్నడ ప్రజలు మంచి వ్యక్తులు. కన్నడ వారివి మాత్రమే కాదు వారు అన్ని బాషల సినిమాలు చూస్తారు. ఇతర భాషలను, సినిమాలను ఎంతో ఇష్టపడతారు" అంటూ చెప్పుకొచ్చాడు.


Tags:    

Similar News