ఫ్యాన్స్ కు సల్మాన్ బర్త్ డే ట్రీట్.. నెక్ట్స్ మూవీ టైటిల్ ఇదే !

56 ఏళ్లు వచ్చినా.. ఇంకా యంగ్ గానే కనిపించే ఈ కండల వీరుడు.. తన పుట్టినరోజు సందర్భంగా ఫ్యాన్స్ కు ట్రీట్ ఇచ్చారు. తన నెక్స్ట్ సినిమా టైటిల్ ను సల్మానే స్వయంగా ప్రకటించాడు.

Update: 2021-12-27 05:36 GMT

కండల వీరుడు.. బాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ గా.. ఇండస్ట్రీలో ఒక బ్రాండ్ గా పేరు గడించిన నటుడు సల్మాన్ ఖాన్ నేడు 56 వ పుట్టినరోజును జరుపుకుంటున్నారు. 56 ఏళ్లు వచ్చినా.. ఇంకా యంగ్ గానే కనిపించే ఈ కండల వీరుడు.. తన పుట్టినరోజు సందర్భంగా ఫ్యాన్స్ కు ట్రీట్ ఇచ్చారు. తన నెక్స్ట్ సినిమా టైటిల్ ను సల్మానే స్వయంగా ప్రకటించాడు. ఇటీవల జరిగిన ఇంటరాక్షన్ లో సల్మాన్ తన అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న భజరంగి భాయిజాన్ సీక్వెల్ టైటిల్ ను ప్రకటించాడు.

భజరంగీ భాయిజాన్ 2 సీక్వెల్
భజరంగీ భాయిజాన్ 2 కోసం రాజమౌళి తండ్రి కెవి విజయేంద్ర ప్రసాద్‌తో కలిసి పని చేయడం గురించి ప్రస్తావించాడు. దాని గురించి మాట్లాడుతూ ఈ చిత్రానికి పవన్ పుత్ర భాయిజాన్ అని పేరు పెట్టినట్లు పేర్కొన్నాడు. ప్రస్తుతం టైగర్ 3 మూవీ షూటింగ్ లో ఉన్న సల్మాన్.. అది పూర్తయ్యాక నో ఎంట్రీ సీక్వెల్, కభీ ఈద్ కభీ దీపావళి షూటింగ్ లలో పాల్గొననున్నట్లు తెలిపాడు. వీటన్నింటి తర్వాత భజరంగీ భాయిజాన్ 2 ఉంటుందని సల్మాన్ స్పష్టం చేశాడు. దీంతో సల్మాన్ ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు.



Tags:    

Similar News