సలార్ రిలీజ్ డేట్ వచ్చేసింది.. ఇక ఫ్యాన్స్ కు పండగే

ఈ ఏడాది సెప్టెంబర్ 28న ప్రపంచ వ్యాప్తంగా సలార్ సినిమాను విడుదల చేయనున్నట్లు చెప్పి.. ఫ్యాన్స్ కు సర్ ప్రైజ్..

Update: 2023-04-05 14:21 GMT

salaar release date

కేజీఎఫ్ 1, కేజీఎఫ్ 2 సినిమాలతో ప్రపంచాన్ని తనవైపుకి తిప్పుకున్న సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్.. ప్రస్తుతం ప్రభాస్ హీరోగా సలార్ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. భారీ తారాగణంతో తెరకెక్కుతోన్న ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. ఇప్పటికే షూటింగ్ ను పూర్తి చేసుకున్న సలార్.. ఏదైనా అప్డేట్ ఇస్తుందేమో అని అభిమానులు ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఇప్పటివరకైతే ప్రభాస్ లుక్ గానీ.. టీజర్ గానీ ఏవీ విడుదల కాలేదు.

తాజాగా సలార్ బృందం.. సినిమా విడుదల తేదీని ప్రకటించింది. ఈ ఏడాది సెప్టెంబర్ 28న ప్రపంచ వ్యాప్తంగా సలార్ సినిమాను విడుదల చేయనున్నట్లు చెప్పి.. ఫ్యాన్స్ కు సర్ ప్రైజ్ ఇచ్చింది. ఈ సినిమాలో ప్రభాస్ సరసన మీనాక్షి చౌదరి, శృతిహాసన్ లు నటిస్తుండగా.. విలన్ గా విలక్షణ నటుడు జగపతిబాబు నటిస్తున్నారు. బాహుబలి తర్వాత వచ్చిన సాహో, రాధేశ్యామ్ ఊహించని డిజాస్టర్లు అయి.. ఫ్యాన్స్ ను నిరాశపరిచింది. సలార్ అయినా.. ప్రభాస్ ను ఆ దెబ్బనుంచి కోలుకునేలా చేస్తుందో లేదో చూడాలి.


Tags:    

Similar News