రూ.500 కోట్ల క్లబ్ లోకి RRR.. రూ.1000 కోట్ల దిశగా ప్రయాణం

ఇప్పటికే సినిమా చూసిన అభిమానులు.. తారక్ - చరణ్ లు సినిమాలో అద్భుతంగా నటించారని కితాబిస్తున్నారు. వాళ్లిద్దరూ కొట్టుకుంటుంటే ..

Update: 2022-03-28 11:17 GMT

హైదరాబాద్ : టాలీవుడ్ సినిమాల శిల్పి జక్కన్న చెక్కిన RRR ప్రపంచవ్యాప్తంగా కాసుల వర్షం కురిపిస్తోంది. వీకెండ్ అయిపోయింది. సినిమా విడుదలై నాలుగు రోజులవుతున్నా.. ఇంకా థియేటర్లలో హౌస్ ఫుల్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. రాజమౌళి కల్పిత కథలో తీసిన ఆ విజువల్ వండర్, రామ్-భీమ్ ల యాక్షన్ హంట్ ను తెరపై చూసేందుకు ప్రేక్షకులు థియేటర్లకు క్యూ కడుతున్నారు. RRRకు బ్రహ్మరథం పడుతున్నారు. కొందరు పనిగట్టుకుని సినిమాపై తప్పుడు ప్రచారం చేసినా.. ప్రేక్షకులు మాత్రం అవేవీ పట్టించుకోకుండా సినిమా చూసేందుకు ఆసక్తి చూపుతున్నారు.

ఇప్పటికే సినిమా చూసిన అభిమానులు.. తారక్ - చరణ్ లు సినిమాలో అద్భుతంగా నటించారని కితాబిస్తున్నారు. వాళ్లిద్దరూ కొట్టుకుంటుంటే చూడలేకపోయామని, తమకే ఏడుపొచ్చిందని చెప్తున్నారు అభిమానులు. ఈ మూడ్రోజుల్లో RRR బాహుబలి రికార్డులను బ్రేక్ చేసింది. రూ.500 కోట్లు వసూలు చేసి.. టాలీవుడ్ లో, సౌత్ ఇండియా సినిమాల్లో సరికొత్త రికార్డును సృష్టించింది. ఈ విషయాన్ని ఫిల్మ్ క్రిటిక్ తరణ్ ఆదర్శ్ సోషల్ మీడియా ద్వారా తెలిపారు. రూ.450 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మితమైన RRR ఇక లాభాల బాటలో పయనిస్తోంది. ఈ వారంలో RRR రూ.1000 కోట్ల వరకూ కలెక్షన్లు రాబట్టినా ఆశ్చర్యపోనక్కర్లేదంటున్నారు సినీ క్రిటిక్స్.






Tags:    

Similar News