వివాదంలో "ది కశ్మీర్ ఫైల్స్" దర్శకుడు

తానూ భోపాలీనేనన్న వివేక్.. తాను ఆ విషయాన్ని ఎక్కడా చెప్పనని అన్నారు. ఎందుకంటే భోపాలీ అంటే ..

Update: 2022-03-26 05:29 GMT

"ది కశ్మీర్ ఫైల్స్" సినిమాతో యావత్ దేశం దృష్టినీ ఆకర్షించిన దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి ఇప్పుడు ఓ వివాదంలో చిక్కుకున్నారు. తాజాగా ఆయన ఓ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. భోపాలీ ప్రజలపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. భోపాలీ అనే పదానికి హోమో సెక్సువల్ అని అర్థమంటూ వివేక్ చేసిన వ్యాఖ్యలు.. ఇప్పుడు తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి.

తానూ భోపాలీనేనన్న వివేక్.. తాను ఆ విషయాన్ని ఎక్కడా చెప్పనని అన్నారు. ఎందుకంటే భోపాలీ అంటే స్వలింగసంపర్కుడని పేర్కొన్నారు. అలాగే నవాబుల ప్రవర్తన అని కూడా అర్థం ఉందని అన్నారు. వివేక్ చేసిన వ్యాఖ్యల వీడియో వైరల్ అవ్వడంతో.. ఆయన్ను విమర్శలు చుట్టుముట్టాయి. పలువురు రాజకీయ నేతలు సహా భోపాలీ ప్రజలు, నెటిజన్లు వివేక్ పై విరుచుకుపడుతున్నారు. దీనిపై కాంగ్రెస్ నేత దిగ్విజయ్ సింగ్ స్పందించారు. ఆయనకు అలాంటి అనుభవం ఉందేమో కానీ భోపాల్ వాసులకు అలాంటి అలవాటు లేదని కౌంటరిస్తూ.. వివేక్ వ్యాఖ్యల వీడియోను షేర్ చేశారు.


Tags:    

Similar News