స్టార్ డమ్ ముఖ్యం కాదు సామీ.. కథ సాగిపోతే.. స్క్రీన్ పై అలా ఉండిపోవాల్సిందే

తాజాగా విడుదలయిన సు ఫ్రమ్ సో కన్నడ చిత్రం అందరి ప్రశంసలను అందుకుంటోంది. అంతేకాదు.. నిర్మాతలకు కాసుల వర్షం కురిపిస్తుంది.

Update: 2025-08-25 06:06 GMT

సినిమాను ప్రేక్షకుడు ఆదరించాలంటే ఏదో ఒక కొత్త విషయంతో కనెక్ట్ అవ్వాలి. భారీ బడ్జెట్, గ్రాఫిక్స్, వీఎఫ్ఎక్స్ లు ముఖ్యం కాదు. కథతో పాటు దానిని నడిపేతీరు కూడా అంతే అవసరం. అప్పుడే వీక్షకులను ఆకట్టుకుంటుంది. సినిమాలో స్టార్ హీరోలున్నారా? భారీ బడ్జెట్ పెట్టారా? అన్నది ఆలోచించరు. తమ జీవన శైలికి సరిపోయే సినిమాలను ఎక్కువగా ప్రేక్షకులు ఆదరిస్తారన్నది మరోసారి రుజువయింది. ఇప్పటి వరకూ విడుదలయిన అనేక సినిమాలు భారీ బడ్జెట్ లతో రూపొందించినప్పటికీ బాక్సాఫీసు ముందు బోల్తా కొట్టాయి.

లాభాలను తెచ్చిపెడుతూ...
ప్రీ రిలీజ్ ఫంక్షన్లు ఎన్ని చేసినా థియేటర్లలో కట్టిపడేసి కేవలం కథమాత్రమేనని మరోసారి రుజువయింది. తాజాగా విడుదలయిన సు ఫ్రమ్ సో కన్నడ చిత్రం అందరి ప్రశంసలను అందుకుంటోంది. అంతేకాదు.. నిర్మాతలకు కాసుల వర్షం కురిపిస్తుంది. ఈ నెల 8వ తేదీన విడుదలయిన ఈ చిత్రం ఇప్పటికే లాభాలను కురిపించేస్తుంది. అసలు అంచనాలు లేకుండా విడుదలయి. సు ఫ్రమ్ సో మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అయిందనే చెప్పాలి. హిట్ టాక్ ను సొంతం చేసుకోవడమే కాకుండా కేవలం ఆరు కోట్ల రూపాయలతో నిర్మించిన సినిమా ఇప్పటికే 35 కోట్ల రూపాయలను తెచ్చిపెట్టింది.
ఎటువంటి అంచనాలు లేకుండానే...
ఈ మూవీకి ఎటువంటి ప్రీ రిలీజ్ ఫంక్షన్లు లేవు. అలాగే మూవీకి హైప్ తేవడానికి నిర్మాతలు ఎటువంటి ప్రయత్నమూ చేయలేదు. అయినా కేవలం మౌత్ టాక్ తోనే సు ఫ్రమ్ సో రికార్డులను క్రియేట్ చేసింది. కన్నడ భాషలో రూపొందించిన ఈ మూవీ తెలుగులో కూడా మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ రిలీజ్ చేసింది. కన్నడనాట ఇప్పటికే మూవీ అక్కడ హిట్ టాక్ తెచ్చుకుని హౌస్ ఫుల్ కలెక్షన్లు వస్తుండగా, తెలుగులోనూ అదే రీతిలో థియేటర్లను ఊపేస్తుంది. జేపీ తుమినాడ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. చిన్న సినిమాగా వచ్చి సూపర్ హిట్ అయిన ఈ మూవీని చూసైనా నిర్మాతలు, దర్శకులు విక్టరీ వెనక రహస్యం తెలుసుకుంటే చాలని తెలుగు ప్రేక్షకులు కోరుతున్నారు.






Tags:    

Similar News