నాగార్జున సినిమాను బాయ్ కాట్ చేయాలంటూ పిలుపు

ఇలా హిందువుల సెంటిమెంట్లతో ఎందుకు ఆడుకుంటూ ఉన్నారో చెప్పాలని

Update: 2022-06-16 15:44 GMT

అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించిన బ్రహ్మాస్త్ర సినిమా ట్రైలర్ కు ప్రేక్షకుల నుండి భారీ స్పందన వస్తోంది. నాలుగేళ్ల క్రితం అయాన్ ప్రాజెక్ట్ ప్రకటించినప్పటి నుంచి బ్రహ్మాస్త్ర వార్తల్లో నిలుస్తోంది. ఆలియా, రణబీర్‌ల కెమిస్ట్రీని స్క్రీన్‌పై చూసేందుకు ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ట్రైలర్ విడుదలైన కొద్ది గంటల్లోనే భారీగా వ్యూస్ ను సొంతం చేసుకుంది. బ్రహ్మాస్త్ర ట్రైలర్ విడుదలైన కొద్ది గంటలకే, నెటిజన్లు ట్విట్టర్‌లో #boycottbrahmastra హ్యాష్‌ట్యాగ్‌ని ట్రెండ్ చేయడం ప్రారంభించారు. బ్రహ్మాస్త్ర ట్రైలర్‌లో రణబీర్ గుడిలోకి ప్రవేశిస్తున్నప్పుడు షూస్ ధరించి కనిపించాడని నెటిజన్లు చెబుతూ ఉన్నారు. హిందూ సెంటిమెంట్లను బాలీవుడ్ ఎప్పుడూ ఎగతాళి చేస్తుందని.. ప్రజలు ట్రైలర్‌లోని క్లిప్‌లో ఆ భాగాన్ని పోస్ట్ చేస్తున్నారు. ఇలా హిందువుల సెంటిమెంట్లతో ఎందుకు ఆడుకుంటూ ఉన్నారో చెప్పాలని బ్రహ్మాస్త్ర నిర్మాతలను ప్రశ్నిస్తున్నారు. ఏది ఏమైనా బ్రహ్మాస్త్ర నిర్మాతల నుంచి ఎలాంటి స్పందన రాలేదు.

సెప్టెంబ‌ర్ 9న ప్ర‌పంచ‌వ వ్యాప్తంగా పాన్ ఇండియా మూవీగా 'బ్రహ్మాస్త్ర' రిలీజ్‌కి సిద్ధ‌మ‌వుతోంది. ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి. ఈ చిత్రంలో బిగ్‌బీ అమితాబ్‌ బచ్చన్‌, నాగార్జున, మౌనీ రాయ్‌ పలు కీలక పాత్రలు పోషిస్తున్నారు. వీరితోపాటు బాలీవుడ్‌ బాద్‌షా షారుక్‌ ఖాన్‌ అతిథి పాత్రలో మెరవనున్నాడని తెలుస్తోంది. 'బ్రహ్మాస్త్ర' తెలుగు ట్రైల‌ర్‌కి మెగాస్టార్ చిరంజీవి వాయిస్ ఓవ‌ర్ అందించారు.


Tags:    

Similar News