ఓటీటీలో గేమ్ ఛేంజర్.. ఎప్పుడంటే?

రామ్ చరణ్ హీరోగా, శంకర్ దర్శకత్వం వహించిన గేమ్ ఛేంజర్ ఓటీటీలోకి త్వరలో రానుందని చిత్ర నిర్మాతలు ప్రకటించారు

Update: 2025-02-04 11:58 GMT

గ్లోబల్ మెగా స్టార్ రామ్ చరణ్ హీరోగా, శంకర్ దర్శకత్వం వహించిన గేమ్ ఛేంజర్ ఓటీటీలోకి త్వరలో రానుందని చిత్ర నిర్మాతలు ప్రకటించారు. సంక్రాంతికి విడుదలయిన ఈచిత్రం అమెజాన్ ప్రైమ్ లో చూడవచ్చని తెలిపారు. ఈ నెల ఏడో తేదీ నుంచి గేమ్ ఛేంజర్ ఓటీటీలో అందుబాటులోకి రానుందని ప్రకటించారు. ఇది నిజంగా మెగా ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ అని నిర్మాతలు తెలిపారు.

ఫిబ్రవరి 7వ తేదీ నుంచి...
ఫిబ్రవరి 7వ తేదీ నుంచి గేమ్ ఛేంజర్ అమెజాన్ లో స్ట్రీమింగ్ అవుతుండటంతో సినిమాను ఇంట్లో కూర్చుని వీక్షించే అవకాశం ఉందని తెలిపింది. ఈ సినిమా తెలుగు, తమిళం, కన్నడ భాషల్లో మాత్రమే ప్రస్తుతం స్ట్రీమింగ్ అవుతుందని తెలిపింది. రామ్ చరణ్ ఈ మూవీలో డబుల్ యాక్షన్ ద్వారా అభిమానులను మెప్పించడంతో ఎక్కువ మంది ఈ మూవీని వీక్షించే అవకాశముందని అంచనా వేస్తున్నారు.


Tags:    

Similar News