రామ్ చరణ్ సినిమా షూటింగ్ ను అడ్డుకున్న బీజేపీ నేతలు

రామ్ చరణ్ సినిమా షూటింగ్ ను అడ్డుకున్న బీజేపీ నేతలు

Update: 2022-07-27 01:30 GMT

రామ్ చరణ్ 15వ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతూ ఉంది. రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాలో కియారా అద్వానీ హీరోయిన్గా నటిస్తోంది. అలాగే అంజలి, శ్రీకాంత్ వంటి వారి ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాను పాన్ ఇండియా లెవెల్లో తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో రూపొందిస్తున్నారు.

ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లో జరుగుతూ ఉంది. ఈ సినిమా షూటింగ్ ను బీజేపీ నేతలు అడ్డుకున్నారు. సినిమా షూటింగ్ జరుగుతుండగా స్థానిక బీజేపీ కార్పొరేటర్ ఆకుల శ్రీవాణి అంజన్ గౌడ్ అడ్డుకున్నారు. హైదరాబాదులోని సరూర్ నగర్ లో జరుగుతుండగా బీజేపీ కార్పొరేటర్ ఆకుల శ్రీవాణి అడ్డుకున్నారు. విక్టోరియా మెమోరియల్ హోం స్కూల్లో కొన్ని సన్నివేశాలు తెరకెక్కిస్తుండగా, బీజేపీ కార్యకర్తలతో కలిసి ఆకుల శ్రీవాణి అక్కడికి వచ్చారు. స్కూల్లో తరగతులు జరుగుతున్న సమయంలో షూటింగ్ కు అనుమతులు ఎలా ఇచ్చారని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డిపై ఆమె ధ్వజమెత్తారు. చదువును పక్కనబెట్టి సినిమా చిత్రీకరణకు అనుమతించడం ద్వారా టీఆర్ఎస్ ప్రభుత్వం ధనార్జనకే ప్రాధాన్యత ఇస్తోందని ఆమె విమర్శించారు.
విద్యార్థుల తరగతులు జరుగుతున్న సమయంలో షూటింగ్ కు అనుమతి ఎలా ఇస్తారు అంటూ ఆమె షూటింగ్ ని అడ్డుకున్నారు. తెలంగాణ విద్యాశాఖ మంత్రి, స్థానిక ఎమ్మెల్యే అయిన సబితా ఇంద్రారెడ్డి తమ స్వలాభం కోసమే విద్యార్థుల జీవితాన్ని పణంగా పెట్టి సినిమా షూటింగ్ కు అనుమతి ఇచ్చారంటూ కార్పొరేటర్ శ్రీవాణి ఆరోపించారు. విద్యార్థులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడం, అలాగే నాణ్యమైన విద్య అందించాల్సిన బాధ్యత మరచిన విద్యాశాఖ మంత్రి షూటింగుల పేర్లతో ఖజానాలను నింపుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆమె ఆరోపించారు. వెంటనే రామచరణ్ సినిమా షూటింగ్ ఆపు చేయాలంటూ ఆమె బీజేపీ శ్రేణులతో కలిసి ధర్నాకు దిగారు. కేవలం సినిమా షూటింగ్ లో కలర్ సరిగ్గా పడడం లేదని నాలుగు కోట్లతో మరమ్మత్తులు చేయిస్తున్నారని ఆమె ఆరోపించారు. సినిమా షూటింగ్ కి ఇలా అనుమతిస్తే విద్యార్థులలో ఏకాగ్రత ఉండదని ఆమె అన్నారు.


Tags:    

Similar News