అనుమతి లేకుండా నా పేరు వాడితే చట్టపరమైన చర్యలు : రజనీకాంత్
సెలబ్రిటీ హోదాలో ఉన్న రజనీకాంత్ కు.. వాణిజ్యపరంగా తన వ్యక్తిత్వం, పేరు, మాటలు, ఫొటోలను ఉపయోగించే హక్కులను..
rajinikanth, vijayawada, tdp
తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్.. అనుమతి లేకుండా తన పేరు, ఫొటో, మాటలు లేదా తనకు సంబంధించిన విలక్షణతలు, ప్రత్యేకలతను వినియోగిస్తే.. చట్టపరమైన చర్యలు తీసుకుంటానని బహిరంగ హెచ్చరిక చేశారు. వ్యక్తిత్వం, సెలబ్రిటీ హక్కులను ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని నటుడి తరపు న్యాయవాది ఎస్ ఎలంభారతి ఈ మేరకు పబ్లిక్ నోటీసు విడుదల చేశారు. సెలబ్రిటీ హోదాలో ఉన్న రజనీకాంత్ కు.. వాణిజ్యపరంగా తన వ్యక్తిత్వం, పేరు, మాటలు, ఫొటోలను ఉపయోగించే హక్కులను నియంత్రణ చేయవచ్చన్నారు. ఇటీవల కొన్ని వేదికలు, మాధ్యమాలు, ఉత్పత్తుల తయారీదారులు రజనీకాంత్ పేరు, మాటలు, ఫొటోగ్రాఫ్, వ్యంగ్య చిత్రం, నటనకు సంబంధించిన చిత్రాలను దుర్వినియోగం చేస్తున్నారన్నారు.
ఇలాంటి వాటి వల్ల సదరు కంపెనీలు.. ప్రజాదరణను పొందుతూ తమ ఉత్పత్తులను కొనుగోలు చేసేలా లేదా తమ ప్లాట్ ఫామ్ లకు వచ్చే చర్యలకు పాల్పడుతున్నాయని న్యాయవాది ఎస్ ఎలంభారతి నోటీసులో పేర్కొన్నారు. చిత్రపరిశ్రమలో ఎంతో గొప్ప పేరున్న తన క్లయింట్ రజనీకాంత్ వ్యక్తిత్వాన్ని దెబ్బతీసేలా, ఎవరైనా అనుమతి లేకుండా ఆయన ఫొటోలు, వాయిస్ తదితరవాటిని ఉపయోగించినా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.