బెనిఫిట్ షో రద్దు.. గుర్తుపెట్టుకుంటామంటూ ఫ్యాన్స్ వార్నింగ్

ఇటీవల ఏపీ సర్కార్ విడుదల చేసిన కొత్త జీఓ ప్రకారం.. పాన్ ఇండియా సినిమాలైన రాధేశ్యామ్, ఆర్ఆర్ఆర్ లకు 10 రోజుల పాటు టికెట్ ధరలను..

Update: 2022-03-11 11:00 GMT

రాజాం : రాధేశ్యామ్ మేనియా మొదలైంది. శుక్రవారం ప్రపంచ వ్యాప్తంగా రాధేశ్యామ్ సినిమా విడుదలవ్వగా.. సూపర్ డూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. నాలుగేళ్ల నిరీక్షణ తర్వాత ప్రభాస్ సినిమా విడుదల, హిట్ అవ్వడంతో అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. స్లోగా సాగే లవ్ స్టోరీ అని రివ్యూలు వచ్చినా.. అభిమానుల హంగామా మాత్రం ఏమాత్రం తగ్గట్లేదు. తెలంగాణలో రాధేశ్యామ్ బెనిఫిట్ షో లు వేయగా.. ఏపీలో మాత్రం ఆ షోలకు అనుమతివ్వలేదు. ఇటీవల ఏపీ సర్కార్ విడుదల చేసిన కొత్త జీఓ ప్రకారం.. పాన్ ఇండియా సినిమాలైన రాధేశ్యామ్, ఆర్ఆర్ఆర్ లకు 10 రోజుల పాటు టికెట్ ధరలను పెంచుకోవచ్చని ప్రభుత్వం ప్రకటించింది. అయితే బెనిఫిటే షోలకు మాత్రం అనుమతి లేదు.

బెనిఫిట్ షోలు లేకుండానే ఏపీలో రాధేశ్యామ్ విడుదలైంది. ప్రభుత్వ ఆదేశాలను కాదని బెనిఫిట్ షోలు వేస్తున్న థియేటర్లకు తాళాలు పడుతున్నాయి. శ్రీకాకుళం జిల్లా రాజాంలో "రాధేశ్యామ్" బెనిఫిట్ షోను వేయడానికి ప్రయత్నించిన ఎస్వీసీ థియేటర్ ను అధికారులు సీజ్ చేశారు. పోలీసులు, రెవెన్యూ అధికారులు థియేటర్ కు తాళాలు వేయడంతో ఈరోజు సినిమాను ప్రదర్శించడం లేదని థియేటర్ యాజమాన్యం ప్రకటించింది. ఈ విషయం న్యూస్ లో రావడం, సోషల్ మీడియాలో వార్త వైరల్ అవ్వడంతో.. ప్రభాస్ అభిమానులు ఈ విషయాన్ని ట్విట్టర్ లో షేర్ చేస్తూ బాగా గుర్తు పెట్టుకుంటామని హెచ్చరిస్తున్నారు.





Tags:    

Similar News