Allu Arjun : ఈ రికార్డుల్లో బన్నీ మొదటివాడని మీకు తెలుసా..!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈ రికార్డులు అందుకున్న మొట్టమొదటి టాలీవుడ్ హీరో.

Update: 2024-03-29 06:39 GMT
Allu Arjun : మెగాహీరోగా ఇండస్ట్రీకి వచ్చి స్టైల్ స్టార్ గా తనకంటూ ఇమేజ్ ని సంపాదించుకోవడమే కాకుండా, తన ఐకానిక్ రోల్స్ తో ఐకాన్ స్టార్ అనే బిరుదుని అందుకున్నారు. అయితే కేవలం ఐకాన్ స్టార్ అని పిలిపించుకోవడమే కాదు, ఆ పిలుపుకి తగ్గట్టు రికార్డులు సెట్ చేస్తూ.. ఎంతోమందికి ఐకాన్ గా నిలుస్తున్నారు. అలాంటి ఓ రికార్డే మేడమ్‌ టుస్సాడ్స్‌ మ్యూజియంలో అల్లు అర్జున్ మైనపు విగ్రహం.
దాదాపు 100 ఏళ్లకు పైగా చరిత్ర ఉన్న మేడమ్‌ టుస్సాడ్స్‌ మ్యూజియంలో తమ మైనపు విగ్రహం ఏర్పాటు చేయడాన్ని ప్రతి ఒక్కరు ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తుంటారు. అలాంటి గౌరవం అల్లు అర్జున్ కి వచ్చింది. నిన్న మార్చి 28న దుబాయ్ మ్యూజియంలో ఈ విగ్రహాన్ని ఓపెన్ చేసారు. అల్లు అర్జున్ ఫ్యామిలీ అంతా ఈ ఓపెనింగ్ కి వెళ్ళింది. కాగా మేడమ్‌ టుస్సాడ్స్‌ మ్యూజియంలో ఇప్పటికే మహేష్ బాబు, ప్రభాస్ మైనపు విగ్రహాలను ఏర్పాటు చేశారు.
అయితే అవి లండన్ మ్యూజియంలో ఉన్నాయి. ఇప్పుడు అల్లు అర్జున్‌ది ఏర్పాటు చేసింది దుబాయ్ మ్యూజియంలో. ఆ మ్యూజియంలో ఈ గౌరవం అందుకున్న మొదటి టాలీవుడ్ యాక్టర్ మాత్రమే కాదు, మొదటి సౌత్ ఇండియన్ యాక్టర్ కూడా అల్లు అర్జునే. ఇలా ఈ విషయంలో అల్లు అర్జున్ మొదటివాడు అనిపించుకున్నారు. అయితే కేవలం దీనిలో మాత్రమే కాదు, మరికొన్ని విషయాల్లో కూడా అల్లు అర్జున్ నెంబర్ వన్ గా నిలిచి ఐకాన్ స్టార్ అనే ట్యాగ్ కి న్యాయం చేస్తున్నారు.
దుబాయ్ గోల్డెన్ వీసా అందుకున్న మొదటి టాలీవుడ్ హీరో అల్లు అర్జున్. బెస్ట్ యాక్టర్ నేషనల్ అవార్డు అందుకున్న మొదటి తెలుగు యాక్టర్ కూడా బన్నీనే. న్యూయార్క్ సిటీ గ్రాండ్ మార్షల్ లో పాల్గొన్న మొదటి టాలీవుడ్ హీరో కూడా అల్లు అర్జునే. అలాగే ఇన్‌స్టాగ్రామ్ వారు డాక్యుమెంటరీ వీడియో చేసిన మొదటి హీరో కూడా బన్నీ కావడం విశేషం. ఇలా అన్నిటిలో తానే నెంబర్ వన్ అనిపించుకుంటూ ఐకాన్ స్టార్ అనిపించుకుంటున్నారు.
Tags:    

Similar News