Tollywood : ఈరోజు నిర్మాతల మండలి అత్యవసర సమావేశం
ఈరోజు నిర్మాతల మండలి సమావేశం కానుంది. ఉదయం 11గంటలకు ఫిల్మ్ ఛాంబర్ లో ప్రొడ్యూసర్స్ అత్యవసర సమావేశం నిర్వహించనున్నారు
ఈరోజు నిర్మాతల మండలి సమావేశం కానుంది. ఉదయం 11గంటలకు ఫిల్మ్ ఛాంబర్ లో ప్రొడ్యూసర్స్ అత్యవసర సమావేశం నిర్వహించనున్నారు. టాలీవుడ్ ఫిలిం ఎంప్లాయీస్ ఫెడరేషన్ నేటి నుంచి సమ్మెకు దిగుతామని, తమకు వేతనాలపై 30 శాతం పెంచాలని డిమాండ్ చేయడంపై నిర్మాతల మండలి నేడు సమావేశమై చర్చించనుంది.
వేతనాలను పెంచడంపై...
అందరు నిర్మాతలకు మరియు సంబంధిత నిర్మాణ సంస్థలు తె వర్కర్స్ ఫెడరేషన్ కోరినట్లుగా వారి పక్షాన వేతనాలను పెంచుతూ ఎటువంటి లేఖలైనా జారీ చేయవద్దని తెలిపారు. వర్కర్స్ ఫెడరేషన్ పేర్కొన్న వేతన పెంపును తెలుగు ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్ అంగీకరించలేదని తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ గౌరవ కార్యదర్శి కె.ఎల్. దామోదర ప్రసాద్ తెలిపారు.